ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనులకు అందని సామాజిక న్యాయం

ABN, First Publish Date - 2022-05-23T06:13:23+05:30

గిరిజనులకు సరైన సామాజిక న్యాయం అందడం లేదని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు తిరుపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు.

అభివృద్ధి నివేదికను వివరిస్తున్న విశాఖ ఉమ్మడి జిల్లా కార్యదర్శి దొండ సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు తిరుపతిరావు

ఎంవీపీ కాలనీ, మే 22: గిరిజనులకు సరైన సామాజిక న్యాయం అందడం లేదని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు తిరుపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖ ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు కె.సత్యనారాయణ అధ్యక్షతన ఎంవీపీ కాలనీలోని గిరిజన భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తిరుపతిరావు మాట్లాడుతూ గిరిజన చట్టాల్లో మార్పులు రావాలని, అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. గిరిజన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు. ఈ సమావేశంలో సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శతక చిట్టయ్య, ప్రధాన కార్యదర్శి కటారి శోభన్‌కుమార్‌, కోశాధికారి రమేశ్‌కుమార్‌, కృష్ణనాయక్‌, రాజేశ్వరరావు, బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దొండ సత్యనారాయణ మూడేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి పనుల నివేదికను చదివి వినిపించారు. 


Updated Date - 2022-05-23T06:13:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising