ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో బీసీలకు అవమానం

ABN, First Publish Date - 2022-05-22T05:13:06+05:30

రాష్ట్రంలో బీసీలకు అవమానాలు ఎదురవుతున్నాయని, పొరుగు రాష్ట్రాలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకు అన్యాయం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి గోపీ విమర్శించారు.

బీసీల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న రొంగలి శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి గోపి

ప్రధానిగా బీసీకి అవకాశం బీజేపీ ఘనత

విశాఖపట్నం, మే 21: రాష్ట్రంలో బీసీలకు అవమానాలు ఎదురవుతున్నాయని, పొరుగు రాష్ట్రాలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకు అన్యాయం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి గోపీ విమర్శించారు. స్థానిక జీవీఎంసీ కల్యాణ మండపంలో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓబీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ చీకటి ఆర్థిక లావాదేవీల్లో భాగంగా పాలకులు రాష్ట్రేతరులకు రాజ్యసభ స్థానాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.


బీజేపీ బీసీలను ఎంతో గౌరవిస్తుందనేందుకు 103 మంది బీసీ ఎంపీలు, అందులో 27 మంది మంత్రులుండడం నిదర్శనమన్నారు. సాక్షాత్తు ప్రధాని బీసీ కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌ మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. నిధులు, విధుల్లేకుండా తూతూ మంత్రంగా అవి నడుస్తున్నాయన్నారు.


ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడపాటి రవీంద్రారెడ్డి, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు పల్లి శ్రీనివాసులునాయుడు, ఉపాధ్యక్షుడు యడ్ల రమణరాజు, ఓబీసీ మోర్చాన ప్రతినిదులు సనపల రామకృష్ణ, జిల్లా, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-22T05:13:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising