ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశానికే ఆదర్శం అమ్మఒడి

ABN, First Publish Date - 2022-06-28T05:34:11+05:30

అమ్మఒడి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమల శాఖా మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు.

అమ్మఒడి చెక్కును లబ్ధిదారులకు ఇస్తున్న మంత్రులు బూడి, అమర్‌నాథ్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడఅమర్‌నాథ్‌

లబ్ధిదారులకు చెక్కు పంపిణీ

అనకాపల్లిఅర్బన్‌, జూన్‌ 27: అమ్మఒడి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమల శాఖా మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు. సోమవారం వారు స్థానిక రావుగోపాలరావు స్టేడియంలో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది తల్లులకు అమ్మఒడి పథకం వల్ల లబ్ధి చేకూరిందన్నారు. 2022-23 సంవత్సరంలో రూ.8 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ అమ్మఒడి పథకంలో కోత విధిస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 75శాతం హాజరు శాతం ఉండాలని జీవోలోనే పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, డీఈవో లింగేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, కార్పొరేటర్లు నీలిమ, ప్రసన్నలక్ష్మి, మందపాటి సునీత, ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైసీపీ నాయకులు మందపాటి జానకీరామరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రూ.238.158 కోట్లు చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. 

Updated Date - 2022-06-28T05:34:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising