ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతమ్మధార హైస్కూల్‌ హెచ్‌ఎం సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2022-12-07T01:05:05+05:30

నాడు-నేడు పనుల్లో నిర్లక్ష్యం, పాఠశాల నిర్వహణలో వైఫల్యం అభియోగాలపై నగరంలోని సీతమ్మధార నెహ్రూ మునిసిపల్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్‌ప్రసాద్‌ను జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ సస్పెండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): నాడు-నేడు పనుల్లో నిర్లక్ష్యం, పాఠశాల నిర్వహణలో వైఫల్యం అభియోగాలపై నగరంలోని సీతమ్మధార నెహ్రూ మునిసిపల్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్‌ప్రసాద్‌ను జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ సస్పెండ్‌ చేశారు. పాఠశాలలో పనిచేస్తున్న మరో నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్‌ జారీచేశారు. మరికొంతమంది టీచర్ల నుంచి వివరణ కోరారు. జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వం ఇచ్చే కిట్లలో బూట్లు ఇంకా కొంతమంది విద్యార్థులకు అందజేయలేదు. అలాగే నాడు-నేడు పనులకు సంబంధించి నిర్లక్ష్యం, పాఠశాల ఆవరణ, మరుగుదొడ్లు నిర్వహణలో వైఫల్యం చెందారనే కారణంతో హెచ్‌ఎంపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఇంకా తరగతుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలపై టీచర్లకు షోకాజ్‌ ఇచ్చిన డీఈవో మరికొందరి నుంచి వివరణ కోరారు.

Updated Date - 2022-12-07T01:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising