ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీలేరు @ 41

ABN, First Publish Date - 2022-05-25T06:35:10+05:30

సీలేరులో ఎండ తీవ్రత రోజురోజుకూ అధికమవుతుండటంతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు.

సీలేరులో నిర్మానుష్యంగా ఉన్న మార్కెట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఠారెత్తిస్తున్న ఎండలు

- అత్యధిక ఉష్ణోగ్రత నమోదు



సీలేరు, మే 24 : సీలేరులో ఎండ తీవ్రత రోజురోజుకూ అధికమవుతుండటంతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. జీకేవీధి మండలం సీలేరులో మంగళవారం భానుడు తన ప్రతాపాన్ని చూపించడంతో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటి వరకు ఇక్కడ 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే అత్యధికంగా నమోదవుతూ వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో కూడా ఇంత వరకు ఈ సీజన్‌లో ఇంత అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. సీలేరులో ఎన్నడూ లేని విధంగా మంగళవారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. సీలేరు పరిసర ప్రాంతాల్లో దట్టమైన అటవీప్రాంతం ఉన్నా ఈ ఏడాది ఇంతటిస్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రాబోయే రోజుల్లో ఎండలు ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 


Updated Date - 2022-05-25T06:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising