ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2న సచివాలయ భవనాలను ప్రారంభించాలి

ABN, First Publish Date - 2022-09-24T06:34:37+05:30

నిర్మాణాలు పూర్తయిన సచివాలయాల భవనాలను వచ్చే నెల 2న ప్రారంభించాలని డీపీవో శిరీషారాణి ఆదేశించారు.

పెదమదీన సచివాలయాన్ని పరిశీలిస్తున్న డీపీవో శిరీషారాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 23: నిర్మాణాలు పూర్తయిన సచివాలయాల భవనాలను వచ్చే నెల 2న ప్రారంభించాలని డీపీవో శిరీషారాణి ఆదేశించారు. ఆమె శుక్రవారం పెదమదీన, గున్నెంపూడి సచివాలయాల భవన నిర్మాణాలను, జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. సచివాలయాల భవన నిర్మాణాల పనులు పూర్తయినందున 2వ తేదీన ప్రారంభానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సువర్ణరాజును ఆదేశించారు.  ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా క్లాప్‌ మిత్రలకు తడి, పొడి చెత్త సేకరణపై ఆమె అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ లవరాజు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ హరీశ్‌, హౌసింగ్‌ ఏఈ గోపీనాథ్‌, సర్పంచ్‌ కొల్లిమళ్ల ధనలక్ష్మి, వైసీపీ మండల అధ్యక్షుడు కొల్లిమళ్ళ అచ్ఛెంనాయుడు పాల్గొన్నారు. 

చెత్తను జిందాల్‌ పవర్‌ ప్రాజెక్టుకు తరలించండి

చోడవరం: గ్రామ పంచాయతీల్లో పోగుపడిన చెత్తను విశాఖ నగర శివారు కాపులుప్పాడ జిందాల్‌ పవర్‌ ప్రాజెక్టుకు తరలించాలని పంచాయతీ అధికారులకు జిల్లా పంచాయతీ అధికారిణి శిరీషారాణి సూచించారు. శుక్రవారం ఆమె మండలంలోని అంభేరుపురం పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉండడంతో పంచాయతీ కార్యదర్శిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వదిలేయకుండా చూడాలని, సేకరించిన చెత్తను జిందాల్‌ ప్రాజెక్టుకు పంపించినట్టయితే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. అలాగే గ్రామాల్లో ఇంటి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సిబ్బంది చేరుకోవాలని ఆదేశించారు. ఆమె వెంట ఈవో పీఆర్‌డీ బి. చైతన్య, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-24T06:34:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising