ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినియోగంలోకి వచ్చిన సీలేరు మొదటి యూనిట్‌

ABN, First Publish Date - 2022-01-19T05:52:01+05:30

సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలోని మొదటి యూనిట్‌ 22 నెలల తర్వాత వినియోగంలోకి వచ్చింది. ఈ యూనిట్‌లో 2020 మార్చి 5న సాంకేతిక లోపాలు తలెత్తి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.

చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు

సీలేరు, జనవరి 18: సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలోని మొదటి యూనిట్‌ 22 నెలల తర్వాత వినియోగంలోకి వచ్చింది. ఈ యూనిట్‌లో 2020 మార్చి 5న సాంకేతిక లోపాలు తలెత్తి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఈ యూనిట్‌ పనులను ఫిట్‌వెల్‌ కంపెనీకి అప్పగించారు. దీంతో వీరు ఇంజనీరింగ్‌ నిపుణులతో యూనిట్‌ లోపాలపై అధ్యయనం చేసిన తర్వాత ఓవరాలింగ్‌ చేయించాలని నిర్ణయించారు. గత ఏడాది కొవిడ్‌ నేపథ్యంలో ఈ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు అన్ని రీడింగ్‌లు కరెక్టుగా రావడంతో యూనిట్‌ను సింకర్‌నైజ్‌ చేసి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు మాట్లాడుతూ.. మొదటి యూనిట్‌ 22 నెలలు తరువాత వినియోగంలోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో నాలుగు యూనిట్లు అందుబాటులో ఉన్నాయని సీఈ రాంబాబు తెలిపారు. 


Updated Date - 2022-01-19T05:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising