ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌

ABN, First Publish Date - 2022-12-10T01:23:35+05:30

రెండు, మూడు రోజుల్లో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల కానున్నదని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డి. గోపీనాధ్‌ తెలిపారు.

కొత్తూరు బాలికల హైస్కూల్‌లో సభ్యత్వాలు అందజేస్తున్న గోపీనాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చోడవరం, డిసెంబరు 9 : రెండు, మూడు రోజుల్లో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల కానున్నదని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డి. గోపీనాధ్‌ తెలిపారు. శుక్రవారం ఇక్కడ చేపట్టిన ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బదిలీలకు సంబంధించి షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నదన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం పీ ఆర్‌టీయూ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు ఉపాధ్యాయుల పీఎఫ్‌ రుణాలు, సరెండర్‌ లీవులు,తదితర బిల్లులకు సంబంధించిన చెల్లింపులన్నీ జనవరి నెలలో ఉపాధ్యాయుల ఖాతాల్లోకి చేరుతాయన్నారు. ఒకటో తేదీ నాటికి ఉపాధ్యాయుల జీతాలు చెల్లించాలని, పెం డింగ్‌ డీఏలు ఇవ్వాలని సీఎంకు పీఆర్‌టీయూ రాష్ట్ర నాయకత్వం చేసిన విజ్ఞప్తి మేరకు జనవరిలో విడుదల కానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దినాయుడు, సత్యం నాయుడు, సింహాద్రి, జయప్రకాశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:23:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising