ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘స్కానింగ్‌ రిపోర్ట్‌లను విధిగా సమర్పించాలి’

ABN, First Publish Date - 2022-01-28T05:38:09+05:30

ల్లాలోని స్కానింగ్‌ కేంద్రాల్లో నిర్వహించే స్కానింగ్‌ రిపోర్ట్‌లను ప్రతి నెలా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశించారు.

మాట్లాడుతున్న జేసీ అరుణ్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రాల్లో నిర్వహించే స్కానింగ్‌ రిపోర్ట్‌లను ప్రతి నెలా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగ నిర్ధారణ నియంత్రణ చట్టం(లింగ నిర్ధారణ నిషేధం) ప్రకారం స్కానింగ్‌ కేంద్రాలకు అనుమతులు మంజూరు చేయడానికి వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా స్థాయి అప్ర్పాప్రియేట్‌ అథారిటీ, అడ్వైజరీ కమిటీ సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకున్న 19 కేంద్రాలకు అనుమతులు మంజూరు చేశారు. ఈ సమావేశానికి జిల్లా ప్రొగ్రాం అధికారులు, అప్ర్పాప్రియేట్‌ అథారిటీ, అడ్వైజరీ కమిటీ సభ్యులు, డెమో విభాగ సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-28T05:38:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising