ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా సంక్రాంతి పండగ

ABN, First Publish Date - 2022-01-17T06:39:09+05:30

పెద్ద పండగను నియోజకవర్గ ప్రజలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ జరు పుకున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో మకర సంక్రాంతి రోజైన శనివారం ఎక్కడ చూసినా కోలాహల వాతావరణమే కనిపించింది.

అయ్యప్ప రథయాత్రలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బంధుగణంతో ప్రతి ఇల్ల్లూ కోలాహలం

 నర్సీపట్నంలో నేత్రపర్వంగా అయ్యప్పస్వామి రథయాత్ర

నర్సీపట్నం/గొలుగొండ/మాకవరపాలెం/నాతవరం, జనవరి 16 : పెద్ద పండగను నియోజకవర్గ ప్రజలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ జరు పుకున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో మకర సంక్రాంతి రోజైన శనివారం ఎక్కడ చూసినా కోలాహల వాతావరణమే కనిపించింది. నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపా లెం, నాతవరం మండలాల్లో ప్రతి ఇల్లు కూతుళ్లు, అల్లుళ్లు, కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాండ్రతో సంద డిగా మారింది. అంతా వేకువనే లేచి తలంటు పోసుకుని, పుణ్యకాలంలో పెద్ద లకు పూజలు జరిపి, బ్రాహ్మణులకు స్వయంపాకాన్ని సమర్పించారు. అనంత రం నూతన వస్త్రాలు ధరించి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు, క్రికెట్‌, ఎడ్లపండ్ల పరుగు పందెలు వంటివి నిర్వహించి విజేతలకు బహు మతులు అందించడం మరింత ఆనం దాన్నిచ్చింది. ఇదిలావుంటే, కనుమ రోజైన ఆదివారం రైతులు తమ పాడి పశువులకు పూజలు నిర్వహించారు. మాంసాహారుల ఇళ్లలో రెట్టించిన ఉత్సాహం కనిపించింది. 

 నేత్రపర్వంగా  రథయాత్ర

నర్సీపట్నం : మకరజ్యోతి ఉత్సవాల్లో భాగంగా నర్సీప ట్నంలో స్వామి అయ్యప్ప రథయాత్రను శనివారం సాయంత్రం నేత్రపర్వంగా నిర్వహించారు. అయ్యప్ప ఆలయం నుంచి ఐదు రోడ్ల కూడలి, పోలీస్‌ స్టేషన్‌, అబీద్‌ సెంటర్‌, వేంకటేశ్వరస్వామి ఆలయం మీదుగా ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి ఊరేగించారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, పద్మావతి దంపతులు హాజరై స్వామివారికి విశేష పూజలు నిర్వహిం చారు.  అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో ఏటా సంక్రాంతి పండగలో మూడు రోజులు ఈ ఉత్సవాలను నిర్వహించేవారు. అయితే ఈసారి కరోనా వ్యాప్తి కారణంగా ఉత్సవాలను రద్దు చేసి, రథయాత్రను మాత్రమే జరిపారు. రథం ముందు చిడతలు, కోలాటాలు తదితర బృందాల కోలాహలం ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు అయ్యప్ప సేవా సంఘం ప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T06:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising