ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిన్నంటిన సంక్రాంతి వేడుకలు

ABN, First Publish Date - 2022-01-17T06:45:09+05:30

సంక్రాంతి, కనుమ పండగలను నియోజకవర్గ ప్రజలు అత్యంత ఆనందోత్సాహాల నడు మ జరుపుకున్నారు. శని, ఆదివారాల్లో జరిగిన ఈ వేడుకలు అంతటా మిన్నంటాయి.

రాంబిల్లి మండలం పెదకలవలాపల్లిలో ముగ్గుల పోటీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఇంటింటా కోలాహల వాతావరణం

నూతన వస్త్రాలు ధరించి పరస్పరం శుభాకాంక్షలు

పలు గ్రామాల్లో  పోటీలు నిర్వహించి.. విజేతలకు బహుమతుల ప్రదానం

ఎలమంచిలి/అచ్యుతాపురం/మునగపాక/రాంబిల్లి, జనవరి 16: సంక్రాంతి, కనుమ పండగలను నియోజకవర్గ ప్రజలు అత్యంత ఆనందోత్సాహాల నడు మ జరుపుకున్నారు. శని, ఆదివారాల్లో జరిగిన ఈ వేడుకలు అంతటా మిన్నంటాయి. ఎలమంచిలి, అచ్యు తాపురం, మునగపాక, రాంబిల్లి మండలాల్లో ఏ ఇల్లు చూసినా సందడిగా కనిపించింది. కూతుళ్లు, అల్లుళ్లు, కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాండ్రు ఇలా.. బంధుగణమంతా ఓ చోట చేరి పెద్ద పండగను చేసుకున్నారు. సంక్రాంతి రోజు అంతా వేకువనే లేచి తలంటు పోసుకుని, పెద్దలకు నూతన వస్త్రాలను చూపి, పిండి వంటలతో భోజనాలను ఆరగించిన అనంతరం సదరు దుస్తులను ధరించి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో పిల్లల హడావుడికి హద్దుల లేకపోయింది. ఇదిలావుంటే, పల్లెల్లో పండగ సంబరాలు అంబారాన్నం టాయి. ముగ్గులు, గుర్రపు పరుగు పందేలు, ఎడ్లబండ్ల పరుగు, క్రికెట్‌ వంటి పోటీలను నిర్వహించి విజేతలకు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఇక కనుమ రోజైన ఆదివారం రైతులు తమ పాడి పశువులకు పూజలు జరిపారు. మాంసాహారుల ఇళ్లతో రెట్టించిన ఉత్సాహం కనిపించింది. మందుబాబులు కేరింతలు కొట్టారు.

Updated Date - 2022-01-17T06:45:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising