ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతాలు, హెల్త్‌ అలవెన్సులు చెల్లించాలి

ABN, First Publish Date - 2022-05-21T05:40:17+05:30

వందలాది మందికి జీతాలు, హెల్త్‌ అలవెన్సులు ఇవ్వకుండా పనిచేయించుకోవడం దారుణమని మున్సిపల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.సుబ్బారావు అన్నారు. కార్మికులకు ఈ నెల 26 నాటికి జీతాలు, అలవెన్సులు చెల్లించాలని కోరుతూ పారిశుధ్యం, యూజీడీ, ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన కార్మికులతో శుక్రవారం జీవీఎంసీ కార్యాలయం ఎదుట భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు.

జీవీఎంసీ కార్యాలయం ఎదుట భిక్షాటన చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీఎంసీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు కార్మికుల భిక్షాటన  

సిరిపురం, మే 20: వందలాది మందికి జీతాలు, హెల్త్‌ అలవెన్సులు ఇవ్వకుండా పనిచేయించుకోవడం దారుణమని మున్సిపల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.సుబ్బారావు అన్నారు. కార్మికులకు ఈ నెల 26 నాటికి జీతాలు, అలవెన్సులు చెల్లించాలని కోరుతూ పారిశుధ్యం, యూజీడీ, ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన కార్మికులతో శుక్రవారం జీవీఎంసీ కార్యాలయం ఎదుట భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు. జీతాలు ఇవ్వండి మహాప్రభో అని మున్సిపల్‌ ఆఫీస్‌ చుట్టూ ఉన్న షాపులు, ఆఫీస్‌కు వచ్చిన వారి వద్ద భిక్షాటన చేశారు. జీతాలు లేక, అడుక్కు తినాల్సిన దుస్థితికి అధికారులు తీసుకువచ్చారని వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులతో పనిచేయించుకుని జీతాలు చెల్లించకపోవతే వారి కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇప్పటికే 98 మంది కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు లేఖలు ఇచ్చామన్నారు.  ఈనెల 26లోగా సమస్యలు పరిష్కరించకపోతే జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంవీ ప్రసాదరావు, నూకరాజు, అప్పారావు, గణేష్‌, నాయుడు, శ్రీను, ఈశ్వరరావు, రాజు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-21T05:40:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising