ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మతిస్థిమితంలేని మహిళ అదృశ్యం

ABN, First Publish Date - 2022-03-05T06:22:07+05:30

మండలంలోని బోయపాడు గ్రామానికి చెందిన పిక్కి సత్యవతి (56) అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ డి.వెంకన్న తెలిపారు.

పిక్కి సత్యవతి (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు 


నక్కపల్లి, మార్చి 4: మండలంలోని బోయపాడు గ్రామానికి చెందిన పిక్కి సత్యవతి (56) అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ డి.వెంకన్న తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం... సత్యవతి కొంతకాలగా మానసికరుగ్మతతో బాధపడుతుది. కుటుంబ సభ్యులు విశాఖ, రాజమహేంద్రవరంలో ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. రెండు, మూడు పర్యాయాలు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోగా కుటుంబ సభ్యులు గాలించి ఇంటికి తీసుకువచ్చారు. ఇటీవల సత్యవతిని ఇంటి వద్ద వుంచి భర్త కొండయ్య, కుమారుడు కలిసి కుమార్తె ఇంటికి వెళ్లారు. తిరిగివచ్చేసరికి ఆమె ఇంటిలో లేదు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కొండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. 


బంగారమ్మపాలెంలో నవవధువు ఆత్మహత్య

ఎస్‌ రాయవరం, మార్చి 4: మండలంలోని బంగారమ్మపాలెం గ్రామంలో ఒక నవ వధువు సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందిన. ఈ ఘటనకు సంబంధించి  ఎస్‌ఐ ఎం శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు... బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన మైలపల్లి లక్ష్మికి ఇదే గ్రామానికి చెందిన మహేశ్‌తో 20 రోజుల కిందట వివాహం జరిగింది. లక్ష్మి శుక్రవారం పుట్టింటికి వెళ్లింది. మధ్యాహ్నం తల్లిదండ్రులు ఇంటి బయట ఉన్న సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కొద్దిసేపటి తరువాత లోపలికి వెళ్లిన తల్లిదండ్రులు... లక్ష్మి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దించి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్టు ఎస్‌ఐ చెప్పారు.  


Updated Date - 2022-03-05T06:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising