ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిట

ABN, First Publish Date - 2022-01-18T05:54:58+05:30

ఆర్టీసీ కాంప్లెక్స్‌ సోమవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. సంక్రాంతి, కనుమ, ముక్కొనుమ పండగలు పూర్తికావడంతో వివిధ ప్రాంతాల నుంచి అత్తమామలు, తల్లిదండ్రుల ఇళ్లకు వచ్చిన కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణమయ్యారు.

బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుగు ప్రయాణికులతో రద్దీ

జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన జనం


అనకాపల్లి టౌన్‌, జనవరి 17: ఆర్టీసీ కాంప్లెక్స్‌ సోమవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. సంక్రాంతి, కనుమ, ముక్కొనుమ పండగలు పూర్తికావడంతో వివిధ ప్రాంతాల నుంచి అత్తమామలు, తల్లిదండ్రుల ఇళ్లకు వచ్చిన కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో కాంప్లెక్స్‌ సందడిగా కనిపించింది. ముఖ్యంగా పాసింజర్‌ ప్లాట్‌ఫారం ప్రయాణికులతో రద్దీగా ఉండగా, ఎక్స్‌ప్రెస్‌ ప్లాట్‌ఫారం అందుకు భిన్నంగా ఉండడం విశేషం. జిల్లా నలుమూలలు, విజయనగరం జిల్లా నుంచి వచ్చిన ప్రయాణికులతో కాంప్లెక్స్‌ కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి కాంప్లెక్స్‌లో  పెద్దగా ప్రయాణికుల అలికిడి లేకపోయినా, మధ్యాహ్నం ఒంటి గంట తరువాత నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా మారింది. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా పెద్దగా ఓఆర్‌ లభించలేదని డిపో అధికారులు చెబుతున్నారు. కొవిడ్‌ ప్రభావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతిలో ఓఆర్‌ 72 నుంచి 75 శాతం మాత్రమే లభించిందని చెప్పారు. 


Updated Date - 2022-01-18T05:54:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising