ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడుగుకో గొయ్యి

ABN, First Publish Date - 2022-10-17T06:57:06+05:30

స్థానిక రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. నాయుళ్లవీధిలోని లక్ష్మీదేవిపేట రైల్వేగేటు జంక్షన్‌ నుంచి గూడ్స్‌షెడ్‌ వరకు రహదారి గోతులమయంగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలో గూడ్స్‌షెడ్‌ వద్ద గోతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అధ్వానంగా రైల్వే స్టేషన్‌ రోడ్డు    

వాహన చోదకులకు తప్పని అవస్థలు

అనకాపల్లిటౌన్‌, అక్టోబరు 16: స్థానిక రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. నాయుళ్లవీధిలోని లక్ష్మీదేవిపేట రైల్వేగేటు జంక్షన్‌ నుంచి గూడ్స్‌షెడ్‌ వరకు రహదారి గోతులమయంగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గూడ్స్‌షెడ్‌ వద్ద ఫ్లైఓవర్‌ వంతెన నిర్మాణానికి చేపట్టిన పిల్లరు ఉన్న చోట, శాఖవీధికి వెళ్లే జంక్షన్‌ వద్ద రహదారి గోతులమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో వర్షపు నీరు గోతుల్లో నిలిచిపోయి గొయ్యి ఎక్కడ ఉందో తెలియక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్టేషన్‌కు అనకాపల్లి నియోజకవర్గంతో పాటు చోడవరం, మాడుగుల, పాడేరు నియోజకవర్గాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అటువంటి ప్రాధాన్యం గల ఈ రహదారికి అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-10-17T06:57:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising