ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి

ABN, First Publish Date - 2022-06-26T06:09:18+05:30

జిల్లాలో 37 చోట్ల తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని గుర్తించినట్టు ఎస్పీ గౌతమి శాలి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ గౌతమి శాలి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ గౌతమి శాలి

అనకాపల్లి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 37 చోట్ల తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని గుర్తించినట్టు ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి, అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆమె ఆదేశించారు. శనివారం అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నమోదైన పోక్సో, మహిళలపై జరిగే నేరాలు, చోరీలు, అనుమానాస్పద మరణాలు, సాధారణ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. కేసుల దర్యాప్తులో జరుగుతున్న జాప్యానికి కారణాలపై స్టేషన్‌ల వారీగా సమీక్ష జరుపుకోవాలని సూచించారు. సమీక్ష సమావేశానికి నర్సీపట్నం సబ్‌ డివిజన్‌ అదనపు ఎస్పీ మణికంఠ చందోలు, అదనపు ఎస్పీలు (క్రైమ్‌) లక్ష్మీనారాయణ, బి.విజయభాస్కర్‌ (పరిపాలన), ట్రైనీ ఏఎస్పీ సునీల్‌ పేరన్‌, డీఎస్పీలు ప్రవీణ్‌కుమార్‌, పి.శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్‌ నరసింహరావు, పైడపు నాయుడు, రేవతమ్మ, జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన సీఐలు, ఎస్‌ఐలు హాజరయ్యారు.


Updated Date - 2022-06-26T06:09:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising