ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివారులో నివాసం.. మురుగుతో సహవాసం!

ABN, First Publish Date - 2022-05-16T06:14:50+05:30

మునిసిపాలిటీలోని పలు వార్డుల్లో ఇళ్ల మధ్య వాడుక నీరు, వర్షపు నీరు నిలిచిపోతోంది. రోజుల తరబడి ఇదే దుస్థితి నెలకొంటుండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రశాంతినగర్‌లో ఇళ్ల మధ్య నిలిచిన మురుగు నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  పలు వార్డుల్లో ఇళ్ల మధ్య వాడుక నీరు, వర్షపు నీరు రోజుల తరబడి తిష్ఠ 

 దుర్వాసనతో పాటు దోమల బెడద

 పందుల సంచారంతో వాతావరణం మరింత పాడు 

 పట్టించుకోని అధికారులు 

 అవస్థలు పడుతున్న జనం

నర్సీపట్నం, మే 15  : మునిసిపాలిటీలోని పలు వార్డుల్లో ఇళ్ల మధ్య వాడుక నీరు, వర్షపు నీరు నిలిచిపోతోంది. రోజుల తరబడి ఇదే దుస్థితి నెలకొంటుండడంతో  ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రశాంతినగర్‌, బ్యాంక్‌ కాలనీ, వెంకునాయుడుపేట, లక్ష్మీనగర్‌, శివపురం శివారు ప్రాం తాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ఓ వైపు దుర్వాసన, మరో వైపు దోమల బెడదతో అవస్థలు పడుతున్నారు. దీనికితోడు ఇటీవల కురిసిన వర్షాలకు ఖాళీ స్థలాలు చెరువులను తలపిస్తున్నారు. పరి స్థితి ఇంత దారుణంగా ఉన్నా అధి కారులు కన్నెత్తి చూడడం లేదని ప్రశాంతినగర్‌కు చెందిన శివ వాపోయారు. పంట కాలువల్లోకి ఈ నీటిని మళ్లించే ఏర్పాట్లు చేయా ల్సిందిగా కోరుతున్నారు. మునిసిపాలిటీలోని శివారు ప్రాం తాల్లో చాలా మంది స్థలాలు కొను క్కొని ఇళ్ల నిర్మాణం చేపడుతుండ డంతో ఊరు పెరుగుతోంది. ఇందుకు అనుగు ణంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు కల్పించడం లేదు. ఫలితంగా వాడుక నీరు, వర్షపు నీరు రోజుల తరబడి తిష్ఠ వేస్తోంది. పందులు సంచరించి వాతావరణాన్ని మరింత పాడుచేస్తు న్నాయి. అధికారులు తక్ష ణమే స్పందించా ల్సిందిగా సామాజిక కార్యకర్త శివనారాయణరాజు కోరారు.

Updated Date - 2022-05-16T06:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising