ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డొంకరాయి పవర్‌ కెనాల్‌కు మరమ్మతులు

ABN, First Publish Date - 2022-05-19T06:33:33+05:30

డొంకరాయి పవర్‌ కెనాల్‌కు ఈ నెల 20వ తేదీ నుంచి అత్యవసర మరమ్మతు, నిర్వహణ పనులు చేపట్టడానికి గ్రిడ్‌ అధికార్ల నుంచి లైన్‌ క్లియర్‌ (ఎల్‌సీ) అనుమతులు కోరినట్టు సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కేకేవీ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

సీలేరు కాంప్లెక్సులో అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సిన డొంకరాయి పవర్‌ కెనాల్‌ ఇదే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- గ్రిడ్‌ అధికార్ల నుంచి అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభం

- నెల రోజులపాటు డొంకరాయి, పొల్లూరుల్లో విద్యుదుత్పత్తి నిలిపివేత

- సీలేరు కాంప్లెక్సు ఎస్‌ఈ ప్రశాంత్‌కుమార్‌


సీలేరు, మే 18: డొంకరాయి పవర్‌ కెనాల్‌కు ఈ నెల 20వ తేదీ నుంచి అత్యవసర మరమ్మతు, నిర్వహణ పనులు చేపట్టడానికి గ్రిడ్‌ అధికార్ల నుంచి  లైన్‌ క్లియర్‌ (ఎల్‌సీ) అనుమతులు కోరినట్టు  సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కేకేవీ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయయ స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ, డొంకరాయి నుంచి ఫోర్‌ బే వరకు సుమారు 16 కిలోమీటర్ల పొడవు ఉన్న పవర్‌ కెనాల్‌ రెండు రీచ్‌ల్లో నిర్వహణ పనులు చేపట్టడానికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యిందని వెల్లడించారు. ఈ పనులకు అవసరమైన మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామని, ఈ పనుల పర్యవేక్షణకు ఇంజనీర్లు, సిబ్బందిని సిద్ధం చేశామని ఆయన తెలిపారు. సుమారు నెల రోజులపాటు నిర్వహించే ఈ పనులకు ఒకటి రెండు రోజుల్లో గ్రిడ్‌ అధికారుల నుంచి గురువారం అనుమతులు రావచ్చని చెప్పారు. పవర్‌ కెనాల్‌లో నిర్వహణ పనులు ప్రారంభిస్తే డొంకరాయి, పొల్లూరు కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని నిలుపుదల చేస్తామని, సీలేరులో అత్యవసర పరిస్థితుల్లో విద్యుదుత్పత్తి చేస్తామని ఎస్‌ఈ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. కాగా ఫోర్‌ బే వద్ద ఎత్తు ప్రదేశం నుంచి కొండచరియలు విరిగి పవర్‌ కెనాల్‌లో పడకుండా అక్కడ మట్టిని తొలగించి రాతి పేర్పు పనులు చేపట్టనున్నట్టు ఎస్‌ఈ తెలిపారు.


Updated Date - 2022-05-19T06:33:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising