ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ-కర్షక్‌ యాప్‌లో పంట నమోదు తప్పనిసరి

ABN, First Publish Date - 2022-08-17T06:29:03+05:30

ఈ-కర్షక్‌ యాప్‌ ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో రైతులు విధిగా పంట నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిణి లీలావతి అన్నారు. మునగపాకలో మంగళవారం ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడారు.

పంట నమోదును వివరిస్తున్న లీలావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వచ్చే నెల మొదటి వారం వరకు గడువు

 జిల్లా వ్యవసాయాధికారిణి లీలావతి  

మునగపాక, ఆగస్టు 16 : ఈ-కర్షక్‌ యాప్‌ ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో రైతులు విధిగా పంట నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిణి లీలావతి అన్నారు. మునగపాకలో మంగళవారం ఏర్పాటైన కార్యక్రమంలో  మాట్లాడారు. వచ్చే నెల మొదటి వారంలోగా రైతులు వేసిన పంటలను ఈ-కర్షక్‌ యాప్‌లో నమోదు చేయాలన్నారు. జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం 54 వేల హెక్టార్లు కాగా, ఆగస్టు 12వ తేదీ నాటికి పదిహేనే వేల హెక్టార్లలో నాట్లు పూర్తయినట్టు చెప్పారు. వర్షపాతం ఆశాజనకంగా ఉండడంతో సెప్టెంబరు మొదటివారం పూర్తయ్యేసరికి పూర్తిస్థాయిలో నాట్లుపడే అవకాశం ఉం దన్నారు. పీఎం కిసాన్‌ పొందడానికి తప్పనిసరిగా ఈ నెలాఖరులోగా ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో 267 పొలం బడి కార్యక్రమాల ద్వారా సాగు పద్ధతులు , దిగుబడి విధానం గురించి రైతులకు తెలియజేసినట్టు చెప్పారు. మునగపాకలో రైతులు కోరిన మేరకు సహకార సంఘం ద్వారానే ఎరువులు అమ్మకం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి జ్యోత్స్నకుమారి, వ్యవసాయ విస్తరణాధికారిణి లక్ష్మి, పీఏసీఎస్‌ సీఈవో ఆడారి కృష్ణ, వ్యవసాయ సహాయకులు రవిరాజు, సింధూజా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T06:29:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising