ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహితపై అత్యాచారం

ABN, First Publish Date - 2022-04-18T06:36:05+05:30

ఆరిలోవకు చెందిన తనపై ఇదే ప్రాంతానికి చెందిన బొబ్బిలి వేణు, పట్నాల శ్యామ్‌ అనే యువకులు మద్యం సేవించి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలైన ఓ వివాహిత శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సీఐ ఇమాన్యుయల్‌ రాజు తెలిపారు.

నిందితులు బొబ్బిలి వేణు, పట్నాల శ్యామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరు నిందితుల అరెస్టు..రిమాండ్‌కు తరలింపు

ఆరిలోవ, ఏప్రిల్‌ 17: ఆరిలోవకు చెందిన తనపై ఇదే ప్రాంతానికి చెందిన బొబ్బిలి వేణు, పట్నాల శ్యామ్‌ అనే యువకులు మద్యం సేవించి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలైన ఓ వివాహిత శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సీఐ ఇమాన్యుయల్‌ రాజు తెలిపారు. దీంతో ఈ కేసును ఎండాడలోని దిశ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశామన్నారు. దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏసీపీ ప్రేమ్‌ కాజల్‌ ఆధ్వరంలో క్లూస్‌ టీమ్‌ దర్యాప్తు జరిపి ఆదివారం ఉదయం నిందితులను ముడసర్లోవ పార్కు సమీపంలో ఆరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. దిశ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అత్యాచారానికి గురైన వివాహిత కేటరింగ్‌ పనులు నిమిత్తం శుక్రవారం సింహాచలం వెళ్లి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఇసుకతోట బస్టాప్‌ వద్దకు ఆటోలో వచ్చింది. ఇక్కడ నుంచి ఆరిలోవ వెళ్లేందుకు వేరే ఆటో గురించి వేచివుండగా ఆరిలోవకు చెందిన ఇద్దరు యువకులు వచ్చి తమ బైక్‌పై డ్రాప్‌ చేస్తామని నమ్మబలకడంతో ఆమె ఆ వాహనం ఎక్కింది. ఈ క్రమంలో తోటగరువుకు సమీపంలోని పాఠశాల వెనక భాగాన వున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఏసీపీ ప్రేమ్‌ కాజల్‌ అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు ముడసర్లోవ సమీపంలో అత్యాచారానికి పాల్పడిన నిందితులు వేణు, శ్యామ్‌లను చాకచక్యంగా పట్టుకున్నారు. వీరిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్టు ఏసీపీ తెలిపారు.


Updated Date - 2022-04-18T06:36:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising