ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్మీపురంలో రైల్వే ఉద్యోగి హత్య

ABN, First Publish Date - 2022-12-16T01:16:08+05:30

కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తనుదారుణంగా హతమార్చిన సంఘటన బుధవారం అర్ధరాత్రి పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లక్ష్మీపురం రైల్వే ట్రాక్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తానే హతమార్చానంటున్న భార్య

కుటుంబ కలహాలే కారణం...

విడాకుల కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకావాల్సిన రోజే దారుణం

పెందుర్తి-రూరల్‌, డిసెంబరు 15:

కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తనుదారుణంగా హతమార్చిన సంఘటన బుధవారం అర్ధరాత్రి పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లక్ష్మీపురం రైల్వే ట్రాక్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గురువారం ఉదయం వెలుగుచూసింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పెందుర్తి సీఐ గొలగాని అప్పారావు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

పశ్చిమ గోదావరి జిలా నిడదవోలుకు చెందిన కిలారి నాగేశ్వరరావు (47), జగదీశ్వరి దంపతులు పదేళ్ల కిందట లక్ష్మీపురం రైల్వే ట్రాక్‌ ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చేశారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. కొన్నాళ్లు కుటుంబంతో ఇక్కడే ఉన్నారు. నాగేశ్వరరావు రైల్వే ఉద్యోగిగా పనిచేసినట్టు తెలిసింది. అయితే ఆర్థిక కారణాలు, భార్యతో మనస్పర్థలు రావడంతో నాగేశ్వరరావు నాలుగేళ్ల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు.

ఉద్యోగాల పేరుతో మోసం

నాగేశ్వరరావు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చాలామంది నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి వారిని మోసగించాడని, డబ్బులు ఇచ్చినవారు తరచూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుండడంతో భార్యాభర్తల మధ్య రోజూ ఘర్షణలు జరిగేవని స్థానికులు తెలిపారు. ఈ కారణంగానే విడాకుల కోసం ఇద్దరూ కోర్టును ఆశ్రయించారని చెబుతున్నారు. నాగేశ్వరరావుకు ఒక స్కార్పియో కారు, రెండు బైకులు, స్వగ్రామమైన నిడదవోలులో ఒక కల్యాణ మండపం, ఇతరత్రా ఆస్తులు వున్నట్టు తెలిసింది.

కోర్టు విచారణకు హాజరుకావాల్సిన రోజే..

విడాకులకు సంబంధించి గురువారం నాగేశ్వరరావు, జగదీశ్వరి కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇంతలో ఏం జరిగిందో కానీ బుధవారం అర్ధరాత్రి నాగేశ్వరరావు స్కూటీపై భార్య, పిల్లలు వుంటున్న ఇంటికి రావడం, తెల్లారేసరికి శవమైపోవడం, తన భర్తను తానే హతమార్చానని చెప్పి జగదీశ్వరి అంగీకరించడం మిస్టరీగా మారింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. హత్యకు గురైన నాగేశ్వరరావు తల, పొట్ట, ముఖంపై బలమైన ఆయుధాలతో కొట్టినట్టు గాయాలు కనిపిస్తున్నాయి. ఆయన వాహనం వద్ద కారంపొడి, రక్తపు మరకలు వుండగా, దానికి 30 అడుగుల దూరంలో నడిరోడ్డుపై మృతదేహం ఉంది. మద్యం మత్తులో వున్న నాగేశ్వరరావు కళ్లల్లో కారం కొట్టి హత్య చేసి వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నాగేశ్వరరావును తానే హత్య చేశానని జగదీశ్వరి చెబుతున్నా...ఆమెకు ఇతరులు ఎవరైనా సహకరించారేమోనన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. జగదీశ్వరి మాత్రం తన భర్తను తానే హతమార్చానని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని చెబుతున్నట్టు తెలిసింది.

Updated Date - 2022-12-16T01:16:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising