ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌సీ జీవోలపై పీఆర్‌టీయూ నిరసన

ABN, First Publish Date - 2022-01-20T06:19:59+05:30

వేతన సవరణ, దానికి అనుబంధంగా జారీ అయిన జీవోలకు నిరసనగా పీఆర్‌టీయూ నేత రీముల నాగేశ్వరావు నేతృత్వంలో ఉపాద్యాయులు బుధవారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జీవో ప్రతులతో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు


కొయ్యూరు, జనవరి 19: వేతన సవరణ, దానికి అనుబంధంగా జారీ అయిన జీవోలకు నిరసనగా పీఆర్‌టీయూ నేత రీముల నాగేశ్వరావు నేతృత్వంలో ఉపాద్యాయులు బుధవారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఆర్‌సీ జీవోని ఉపసంహరించుకోవాలని, హెచ్‌ఆర్‌ఏ పాత శ్లాబులనే కొనసాగించాలని, 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని, గ్రాట్యూటీ రూ.20 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఫణీంద్ర, ఓ.సత్యనారాయణ, నర్సు పాపారావు తదితరులు పాల్గొన్నారు. 


ఉద్యోగులను మోసగించిన వైసీపీ ప్రభుత్వం

పాడేరు, జనవరి 19: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్‌సీతో ఉద్యోగులను మోసం చేసిందని దండకారణ్య విమోచన సమితి, దండ కారణ్య ఉద్యోగ సమితి కేంద్ర కమిటీ ప్రతినిధులు తిథిలి పాంగి, లలిత్‌ మార్కెండ్‌ బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పీఆర్‌సీ అమలైనప్పుడు ఉద్యోగుల జీతాలు పెరగడం సర్వసాధారణమని, కానీ వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు తగ్గేలా పీఆర్‌సీని అమలు చేయడం ఘోరమన్నారు.  ప్రభుత్వం తీరుపై ఉద్యోగులు చేపట్టే ఆందోళనలకు తాము పూర్తి మద్దతు ఇస్తామన్నారు. ఏజెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగులకు బీసీఏ, ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-01-20T06:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising