ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వసతి గృహంలో సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-09-11T06:04:25+05:30

Problems should be resolved in the hostel

వసతి గృహం బయట బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఐఎప్‌ఎఫ్‌ డిమాండ్‌

సీతమ్మఽధార, సెప్టెంబరు 10: సీతమ్మధార టీపీటీ కాలనీలో గల డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ బాలుర ఎస్‌సీ వసతి గృహంలో మంచి భోజనం పెట్టటం లేదని, సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి జి.ఫణీంద్ర కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌సీ వసతి గృహం వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో హాస్టల్‌ విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హాస్టల్‌ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి విద్యను అందిస్తామని, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా హాస్టల్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పి, ఇంతవరకు పట్టించుకోలేదని ఆరోపించారు.  హాస్టల్‌లో సరైన మెనూ అమలు కావడం లేదని, అదేవిధంగా స్నానాల గదులు అపరిశుభ్రంగా ఉన్నాయని, సరైన ఆరోగ్య వసతులు లేని పరిస్థితి నేలకొందని ఆయన వివరించారు. వార్డెన్‌ కూడా  అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. దీనిపై హాస్టల్‌ వార్డెన్‌ వర ప్రసాద్‌ మాట్లాడుతూ హాస్టల్‌లో విద్యార్థులతో కలసి అనధికారికంగా ఉంటున్నవారిని ఖాళీ చేయించామని, దీంతో వారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఈమేరకు  ద్వారకా పోలీసు స్టేషన్‌లో, స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్టు వార్డెన్‌ పేర్కొన్నారు.


Updated Date - 2022-09-11T06:04:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising