ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనస్తాపంతో ప్రైవేటు పాఠశాల టీచర్‌ ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-01-18T04:38:33+05:30

ఉద్యోగం మానేసి పిల్లలను చూసుకోవాలని భర్త చెప్పడంతో మనస్తాపానికి గురైన ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

రాజేశ్వరి (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లంకెలపాలెం, జనవరి 17: ఉద్యోగం మానేసి పిల్లలను చూసుకోవాలని భర్త చెప్పడంతో మనస్తాపానికి గురైన ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పరవాడ మండలం కన్నూరు గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చింతల రాజేశ్వరి(30) భర్త అప్పారావు, ఇద్దరి పిల్లలతో కలిసి కన్నూరు గ్రామంలో నివాసముంటున్నారు. భర్త కశింకోటలోని ప్రభుత్వ రెసిడెన్సియల్‌ పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, రాజేశ్వరి మునగపాక మండలం తోటాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగం మానేసి ఇంటి వద్ద ఉండి పిల్లలను చూసుకోవాలని ఇటీవల భర్త చెప్పడంతో అప్పటి నుంచి ఆమె మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోరోజూ మాదిరిగానే భర్త సోమవారం విధులకు వెళ్లారు. పెద్ద కుమారుడు(6) ఆమె ఆడపడుచు ఇంటికి వెళ్లగా, చిన్న కుమారుడు(2) ఇంట్లోనే ఉన్నాడు. కాగా మనస్తాపంతో ఉన్న ఆమె ఫ్యాన్‌ హుక్కుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వాళ్లు గమనించి ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిబ్బందితో ఎస్‌ఐ సురేశ్‌ సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి  తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-18T04:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising