ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణ ఆరోగ్యానికి ప్రాధాన్యం

ABN, First Publish Date - 2022-07-03T06:33:00+05:30

గ్రామీణ ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైద్య శాఖ అధికారుల సమావేశంలో  కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి 

 

అనకాపల్లి టౌన్‌, జూలై 2 : గ్రామీణ ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి సూచించారు. పట్టణంలోని మళ్ల జగన్నాథం కల్యాణ మండపంలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. సుస్థిర అభివృద్ధి సూచికలు 14 గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రణాళికా బద్ధంగా అమలు చేయాలన్నారు. కనీసం 90 శాతానికి మించి అమలు ఉండాలన్నారు. సంపూర్ణ పోషణ, కొవిడ్‌ టీకాలు, ప్రధానమంత్రి మాతృ వందన యోజన జనని సురక్ష కార్యక్రమం, సుఖ ప్రసవాలు వంటి వాటిలో ఎటువంటి లోటు రానీయకుండా నిర్వహించాలని సూచించారు.  బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. అన్ని కార్యక్రమాల డేటా తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఉత్తమ సేవలందించి డేటా ఎంట్రీ సక్రమంగా చేసిన రోలుగుంట, తాళ్లపాలెం, హరిపాలెం, శారదానగర్‌ డాక్టర్లను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ హేమంత్‌, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీ సీతామహాలక్ష్మి, వైద్యులు, ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-03T06:33:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising