ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర పంటల ద్వారా చీడపీడల నివారణ

ABN, First Publish Date - 2022-01-29T05:24:07+05:30

అంతర పంటల ద్వారా పొలంలో చీడపీడలను నివారిం చుకోవచ్చని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.సరిత తెలిపారు.

సబ్బవరంలో నువ్వుల పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, జనవరి 28 : అంతర పంటల ద్వారా పొలంలో చీడపీడలను నివారిం చుకోవచ్చని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.సరిత తెలిపారు. మండలంలోని అసకపల్లి, ఎరుకునాయుడుపాలెం గ్రామాల్లో చోడి, టమాటా, మిరప, నువ్వులు, బొబ్బర్లు పంటలను శుక్రవారం శాస్త్రవేత్తలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు వరి నారుమడిలో యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. మిరప, టమాటా వంటి కూరగాయ పంటలలో బంతి మొక్కలను ఎర పంటగాను, మొక్క జొన్న, జొన్న వంటి రక్షక పంటలను పొలం చుట్టూ గట్లపై వేయడం ద్వారా చాలా వరకు తెగుళ్లును, రసం పీల్చే పురుగులను, కాయతొలిచే పురుగులను అదుపులో ఉంచవచ్చన్నారు. నువ్వులు, బొబ్బర పంటలలో తొలిదశలో ఆశించే చీడపీడల యాజమాన్య చర్యలను రైతులకు సూచించారు. కార్యక్రమంలో బీసీటీ- కృషి విజ్ఞాన కేంద్రం శాస్తవేత్తలు బండి నాగేంద్రప్రసాద్‌, తులసీలక్ష్మి, ఏవో పోతల సత్యనారాయణ, వీఏఏ అలేఖ్య, పలువురు రైతులు పాల్గొన్నారు. 

పెదగాడిలో..

పెందుర్తి రూరల్‌: సేద్యంలో జీవ నియంత్రణ పద్ధతులను పాటించడం ద్వారా పొలంలో చీడపీడలను తగ్గించవచ్చని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.సరిత తెలిపారు. జాగృతీ సంస్థ ఆధ్వర్యంలో పెందుర్తి గ్రామీణ మండలం పెదగాడిలో శుక్రవారం నిర్వహించిన ప్రకృతీ ఫల రైతు ఉత్పత్తిదారుల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. రైతులకు పలు సూచనలు చేశారు. ఆకుకూరలు, కొబ్బరి, మామిడి తోటల పెంపకం వల్ల కలిగే లాభాలను వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బండి నాగేంద్రప్రసాద్‌, లక్ష్మితులసి, సీఈవో ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising