ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీసీ కెమెరాలతో అసాంఘిక పనులకు అడ్డుకట్ట

ABN, First Publish Date - 2022-08-09T06:55:40+05:30

గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం వలన అసాంఘిక కార్యక్రమాలు నివారించవచ్చునని అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ అన్నారు.

గ్రామస్థులతో మాట్లాడుతున్న డీఎస్పీ సునీల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అనకాపల్లి డీఎస్పీ సునీల్‌

చీడికాడ, ఆగస్టు 8: గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం వలన అసాంఘిక కార్యక్రమాలు నివారించవచ్చునని అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వివిధ పనులపై వచ్చిన వారితో మాట్లాడారు. సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం వలన దొంగతనాలు, గంజాయి వ్యాపారం, కలప రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించ డానికి అవకాశం ఉంటుందన్నారు. మండలంలో అన్ని పంచాయతీల్లో సదస్సులు ఏర్పాటు చేసిన ప్రజలను చైతన్యపరచాలని స్థానిక ఎస్‌ఐ సుధాకర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చోడవరం రూరల్‌ సీఐ బి.తాతారావు, టీడీపీ నాయకుడు జాజిమొగ్గల గణేష్‌, పోలీసులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-09T06:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising