ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌సీ జీవోలను రద్దుచేయాలి

ABN, First Publish Date - 2022-01-29T05:41:30+05:30

చీకటి పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని, ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కరించాలని పీఆర్‌సీ సాధన సమితి ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పీఆర్‌సీ సాధన సమితి విశాఖపట్నం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి.

రిలే నిరాహార దీక్షలో పీఆర్‌సీ సాధన సమితి ప్రతినిధులు, ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండో రోజు దీక్షలో పీఆర్‌సీ సాధన సమితి ప్రతినిధులు 

సిరిపురం, జనవరి 28: చీకటి పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని, ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కరించాలని పీఆర్‌సీ సాధన సమితి ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పీఆర్‌సీ సాధన సమితి విశాఖపట్నం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని, సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేయాలని ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాధన సమితి ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యోగుల అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల జేబులకు చిల్లు పెట్టే 11వ పీఆర్‌సీ జీవోలను రద్దు చేసి, అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను బయటపెట్టాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు దాచుకున్న రూ.2,100 కోట్లు జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ లోన్లు, పదవీ విరమణ ప్రయోజనాలు తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాలుగు జేఏసీల ప్రతినిధులు కె.ఈశ్వరరావు, నాగేశ్వరరెడ్డి, ఎస్‌.వి.రమణ, ఫ్యాప్టో, యూటీఎఫ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. పీఆర్‌సీ సాధన సమితి దీక్షకు వీఆర్వోల రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి, జగ్గునాయుడు, రమణ తదితరులు సంఘీభావాన్ని తెలియజేశారు.


Updated Date - 2022-01-29T05:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising