ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పేదరిక నిర్మూలనకు నడుంకట్టాలి’

ABN, First Publish Date - 2022-08-14T05:11:05+05:30

ప్రభుత్వాలు 75 సంవత్సరాల పేరిట అమృత ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, అయితే పేదరికం, నిరుద్యోగం నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆచార్య కేఎస్‌ చలం పేర్కొన్నారు.

సమావేశంలో పాల్గొన ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతంపేట, ఆగస్టు 13: ప్రభుత్వాలు 75 సంవత్సరాల పేరిట అమృత ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, అయితే పేదరికం, నిరుద్యోగం నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని  ఆచార్య కేఎస్‌ చలం పేర్కొన్నారు. ద్వారకానగర్‌లో గల పౌరగ్రంథాలయంలో దళిత హక్కుల పోరాట సమితి, ప్రోగ్రెసివ్‌ ఫోరం, దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వామపక్ష దళిత ఉద్యమాల ఐక్య కార్యాచరణ ఆవశ్యకత, మన కర్తవ్యం అనే అంశంపై చర్చా గోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన ఆచార్య కేఎస్‌ చలం మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అగ్ర కులాలకు, పారిశ్రామికవేత్తలకు పట్టం కడుతున్నదే తప్ప పేదల పక్షాన ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు లోకనాఽథం మాట్లాడుతూ పేదల శ్రమ దోపిడీ ఇంకా కొనసాగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సీపీఐ నాయకుడు జేవీ సత్యనారాయణ  మూర్తి మాట్లాడుతూ రాష్ట్రాల్లోని దళిత, సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి కమ్యూనిస్టులు అనేక కార్యక్రమాలు కలిసికట్టుగా చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత, ప్రజా సంఘాల నాయకులు జేవీ ప్రభాకర్‌, ఆర్‌.పైడిరాజు, అప్పారావు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising