మార్కెట్‌లో శ్రావణ సందడి
ABN, First Publish Date - 2022-08-04T06:53:58+05:30
రైతుబజార్లు, పూర్ణామార్కెట్‌లో శ్రావణమాసం సందడి కనిపిస్తోంది. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో బుధవారమే వినియోగదారులు కొనుగోలుకు ఆసక్తి చూపారు. ఇదే అదనుగా వ్యాపారులు పూజాసామగ్రి ధరలను పెంచేశారు. దీనికి మార్కెటింగ్ శాఖాధికారులు సహకరించారనే ఆరోపణలున్నాయి.
ఇష్టానుసారం ధరల పెంపు
రైతుబజార్లలో అరటి పళ్లు కిలో రూ.50
చామంతులు పావు కిలో రూ.200
కొబ్బరికాయ రూ.25 పైనే
యాపిల్స్ కిలో రూ.250కి పెంపు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
రైతుబజార్లు, పూర్ణామార్కెట్‌లో శ్రావణమాసం సందడి కనిపిస్తోంది. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో బుధవారమే వినియోగదారులు కొనుగోలుకు ఆసక్తి చూపారు. ఇదే అదనుగా వ్యాపారులు పూజాసామగ్రి ధరలను పెంచేశారు. దీనికి మార్కెటింగ్ శాఖాధికారులు సహకరించారనే ఆరోపణలున్నాయి. మార్కెట్‌లో సాధరణంగా అరటిపళ్లను డజన్, అర డజన్ లెక్కన కొనుగోలు చేయడం రివాజు. అయితే రైతుబజార్లలో కొత్త ధోరణికి తెర తీశారు. డిమాండ్ ఉన్న రోజుల్లో కిలో ల చొప్పున అమ్ముతున్నారు. ఇపుడు శ్రావణమాసం పూజలకు ప్రతి ఒక్కరు అరటిపళ్లను కొంటుండడంతో కిలో రూ.50 చొప్పున అమ్ముతున్నారు. డజను ‘వంద’అంటున్నారు. దేశివాళీ అరటి పళ్లు సైజును బట్టి డజను రూ.80 నుంచి రూ.100 వరకు, యాపిల్ కిలో రూ.250 చొప్పున అమ్మారు. పూల దోపిడీ మరీ దారుణంగా ఉంది. చామంతులు పావు కిలో రూ.200 చొప్పునవిక్రయించారు. గులాబీలు చిన్నవి ఒక్కొక్కటి రూ.5 చొప్పున విక్రయించారు. కొబ్బరికాయ రూ.25 పైనే. పూలు, పళ్లు అమ్మేవారితోనే మార్కెట్‌లు రద్దీగా మారాయి.
Updated Date - 2022-08-04T06:53:58+05:30 IST