ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీచ్‌ రోడ్డులో ప్లాస్టిక్‌ రహిత ఎగ్జిబిషన్‌

ABN, First Publish Date - 2022-08-14T06:40:34+05:30

భావితరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించాలంటే నేటి నుంచి ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు.

ప్లాస్టిక్‌ నిషేధంపై పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న మంత్రి ముత్యాలనాయుడు, మేయర్‌, కమిషనర్‌ , ఎంపీ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు

బీచ్‌ రోడ్డు, ఆగస్టు 13: భావితరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించాలంటే నేటి నుంచి ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని  పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. బీచ్‌ రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్‌ హాలు ఎదుట  జీవీఎంసీ, వీసీసీఐ ఉమెన్స్‌వింగ్‌, ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ రహిత ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు.


అనంతరం మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వల్ల జరిగే నష్టాన్ని, కాలుష్యంతో సముద్ర జీవులకు కలుగుతున్న హానిని తెలుసుకోవాలన్నారు. కాలుష్యానికి హాని లేని వస్తువులు వాడడంతోపాటు ప్రతి ఒక్కరూ వాడేలా చైతన్యపరచాలన్నారు. అనంతరం మంత్రి స్టాల్స్‌ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, కమిషనర్‌ లక్ష్మీషా, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-14T06:40:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising