ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు

ABN, First Publish Date - 2022-08-13T06:01:40+05:30

ఏజెన్సీలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఐటీడీఏ రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశిం చారు.

మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశం


పాడేరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఐటీడీఏ రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశిం చారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా, డివిజన్‌ స్థాయి అధికారులతో శుక్రవారం నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌ హాజరవుతార న్నారు. వెలుగు, జీసీసీ ఆధ్వర్యంలో స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, డీఆర్‌డీఏ డ్వామా, హౌసింగ్‌, ఐసీడీఎస్‌, ఐటీడీఏ, వైద్యారోగ్య శాఖ ల ఆధ్వర్యంలో శకటాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా శకటాల ఏర్పాటుకు అవసరమైన నిధులు మం జూరు చేస్తామన్నారు. ఎప్పటిలాగే పోలీసులు, విద్యార్థు లు మార్చ్‌ఫాస్ట్‌, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించా లన్నారు ఉదయం ఎనిమిది గంటలకు అన్ని కార్యాల యాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి అధికారు లు, సిబ్బంది 8.25 గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌కు చేరు కోవాలని పీవో గోపాలక్రిష్ణ సూచించారు. ఈ సమా వేశంలో జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసు, డీఆర్‌వో బి.దయానిధి, ఐటీడీఏ ఏపీవోలు వీఎస్‌.ప్రభాకరరావు, ఎం.వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ విద్యాశాఖ డీడీ కొండలరావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌శాఖ ఈఈ డీవీఆర్‌ఎం.రాజు, పంచాయతీరాజ్‌ ఈఈ  కె.లావణ్యకుమార్‌, డీఈవో పి.రమేశ్‌, డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


నేడు భారీ జాతీయ జెండాతో ర్యాలీ

ఐటీడీఏ కార్యాలయం నుంచితలారిసింగి వరకు శనివారం ఉదయం 10.30 గంటలకు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహిస్తామని ఐటీడీఏ పీవో తెలిపారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొంటారన్నారు.


Updated Date - 2022-08-13T06:01:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising