ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-10-07T06:08:30+05:30

తాండవ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు ప్రమాదస్థాయికి చేరువలో ఉండడంతో లోతట్టు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండవ రిజర్వాయర్‌ డీఈఈ రాజేంద్రకుమార్‌ కోరారు.

తాండవ రోడ్డుపై గ్రావెల్‌ వేయిస్తున్న డీఈఈ రాజేంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


డీఈఈ రాజేంద్రకుమార్‌

నాతవరం. అక్టోబరు 6: తాండవ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు ప్రమాదస్థాయికి చేరువలో ఉండడంతో లోతట్టు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండవ రిజర్వాయర్‌ డీఈఈ రాజేంద్రకుమార్‌ కోరారు. గురువారం ఆయన రిజర్వాయర్‌ను సందర్శించి, నీటి నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేంద్రకుమార్‌ మాట్లాడుతూ.. వర్షాలు విస్తారంగా పడుతుండడంతో తాండవ నది పక్కనే ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. నదిలోకి ఎవ్వరూ దిగవద్దని హెచ్చరించారు. తాండవ గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా.. ప్రస్తుతం తాండవలో 377.4 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయని, ఇన్‌ఫ్లో ద్వారా 1,200 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. కుడి, ఎడమ కాలువలకు 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. 


తాండవ రోడ్డు పరిశీలన

అలాగే తాండవ రోడ్డు అధ్వానంగా ఉందని ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో గురువారం డీఈఈ రాజేంద్రకుమార్‌ గోతులతో ఉన్న తాండవ రోడ్డును పరిశీలించారు. వర్షం తగ్గిన వెంటనే గ్రావెల్‌తో తాండవ రోడ్డు గోతులను పూడ్చుతామని ఆయన తెలిపారు. అలాగే ఈనెల 11న తాండవలో నల్లగొండమ్మతల్లి పండగ ఉండడంతో అధికారులు తాండవ రోడ్డు గోతులు కప్పనున్నారు.

Updated Date - 2022-10-07T06:08:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising