ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విరాళాలందించి మాతృ సంస్థ రుణం తీర్చుకోండి

ABN, First Publish Date - 2022-09-19T07:04:05+05:30

ఆంధ్రా మెడికల్‌ కళాశాల (ఏఎం సీ) శతాబ్ది వేడుకలను పురస్కరిం చుకుని పూర్వ విద్యార్థుల సహ కారంతో తలపెట్టిన సెంటినరీ అకడ మిక్‌ బ్లాక్‌ నిర్మాణానికి ఉదారంగా నిధులందించి మాతృ సంస్థ రుణం తీర్చుకోవాలని బ్లాక్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రవిరాజు కోరారు.

సమావేశానికి హాజరైన పూర్వ విద్యార్థులు, నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఎంసీ పూర్వ విద్యార్థులకు సెంటినరీ అకడమిక్‌ బ్లాక్‌ చైర్‌పర్సన్‌ రవిరాజు

విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రా మెడికల్‌ కళాశాల (ఏఎం సీ) శతాబ్ది వేడుకలను పురస్కరిం చుకుని పూర్వ విద్యార్థుల సహ కారంతో తలపెట్టిన సెంటినరీ అకడ మిక్‌ బ్లాక్‌ నిర్మాణానికి ఉదారంగా నిధులందించి మాతృ సంస్థ రుణం తీర్చుకోవాలని బ్లాక్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రవిరాజు కోరారు. ఏఎంసీ పూర్వ విద్యార్థుల సమావేశం ఆదివారం స్థానిక అంకోసా మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి దాదాపు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు రూ.40 కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్న భవనంలో హాల్‌ ఆఫ్‌ డోనర్స్‌, హాల్‌ ఆఫ్‌ హిస్టరీ, లెజెండ్‌ ఆఫ్‌ ఏఎంసీ, కాన్పరెన్స్‌ గదులు, స్టూడెంట్‌ కేప్టేరియా, యాక్టివిటీ సెంటర్‌, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆడిటోరియం, అలూమ్నీసెంటినరీ కన్వెన్షన్‌ సెంటర్‌ ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు కోటి రూపాయల వరకు విరాళాలను ప్రకటించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఆర్‌.శశిప్రభ, డాక్టర్‌ పెదవీర్రాజు, డాక్టర్‌ టి.రాధ, ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బుచ్చిరాజు, డాక్టర్‌ పి.వి.సుధాకర్‌, డాక్టర్‌ ఎస్‌.కె.ఈ.అప్పారావు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-19T07:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising