ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడేరులో పెట్రోల్‌ కష్టాలు

ABN, First Publish Date - 2022-05-22T06:43:34+05:30

అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో వాహనదారులకు రెండు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ దొరకడం లేదు. పట్టణంలో నాలుగు పెట్రోల్‌ బంక్‌లు ఉండగా.. మూడు బంకుల్లో శుక్రవారం సాయంత్రం నుంచే డీజిల్‌, పెట్రోల్‌ లేదు.

బంక్‌ వద్ద క్యూకట్టిన వాహనదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రెండు రోజులుగా దొరకని డీజిల్‌, పెట్రోల్‌

వాహనదారులకు తప్పని తిప్పలు 

పాడేరురూరల్‌, మే 21: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో వాహనదారులకు రెండు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ దొరకడం లేదు. పట్టణంలో నాలుగు పెట్రోల్‌ బంక్‌లు ఉండగా.. మూడు బంకుల్లో శుక్రవారం సాయంత్రం నుంచే డీజిల్‌, పెట్రోల్‌ లేదు. దీంతో  ఆయా బంక్‌ల వద్ద నో-స్టాక్‌ బోర్డులు పెట్టి వాహనాలు రాకుండా తాళ్లను అడ్డంగా కట్టారు. ఇక ఉన్న ఒక్క బంక్‌ వద్ద ఉన్న కొద్దిపాటి పెట్రోల్‌కు వాహనదారులు క్యూ కట్టారు. గంటల కొలది నిరీక్షించి అర లీటరు, లీటరు పెట్రోల్‌ వేయించుకొని వెళుతున్నారు. ఇదిలా ఉండగా మార్గమద్యంలో ఆగిపోయిన వాహనదారులు బంక్‌ల వద్దకు వచ్చి బతిమలాడుకుంటూ బాటిళ్లలో అరలీటరు పెట్రోల్‌ను తీసుకువెళ్తున్నారు. దాంతో వాహనదారులు వాహనాలను నడిపే పరిస్థితి కానరావడం లేదు. దీంతో కొంతమంది హుకుంపేట, జి.మాడుగుల, పెదబయలు మండల కేంద్రాల వైపు పెట్రోల్‌ కోసం పరుగు తీస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై బంక్‌ యజమానులను ప్రశ్నించగా.. గతంలో మాదిరిగా ఇంధన సరఫరా కావడం లేదన్నారు. కోటా తగ్గిపోవడంతో రోజూ రావాల్సిన ఇంధనం రెండు రోజులకు ఒకసారి వస్తున్నదన్నారు.


Updated Date - 2022-05-22T06:43:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising