ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్యంపై మహా నిర్లక్ష్యం!

ABN, First Publish Date - 2022-08-04T06:58:15+05:30

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి... ఎక్కడా చెత్త కనిపించకూడదు... కాలువల్లో పూడికలు ఎప్పటికప్పుడు తొలగించాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్మికులను వేధిస్తున్న పనిముట్ల కొరత

పరికరాలు లేకుండానే నిత్యం విధుల్లోకి 

కొబ్బరినూనె, యూనిఫారం కోసం ఎదురుచూపులు

ఏడాదిగా కొనుగోలు చేయని జీవీఎంసీ 

నిధుల కొరత సాకుతో దాటవేత

సొంత డబ్బుతో కొనుగోలు చేస్తున్న కార్మికులు

పట్టించుకోని జీవీఎంసీ కమిషనర్‌

 


 (విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి) 

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి... ఎక్కడా చెత్త కనిపించకూడదు... కాలువల్లో పూడికలు ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇంటింటికీ చెత్త సేకరణ సక్రమంగా జరగాలి... స్వచ్ఛసర్వేక్షణ్‌లో నగరం ప్రథమ స్థానంలో నిలవాలి... ఇదీ జీవీఎంసీ అధికారులు పారిశుధ్య కార్మికులకు నిత్యం జారీ చేస్తున్న ఆదేశాలు...

మరి నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సామగ్రి, సిబ్బందికి రక్షణ పరికరాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నారా అంటే... సమాధానం లేదు. ఆరునెలలకోసారి అందించాల్సిన ఈ పనిముట్ల విషయంలో యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా గోచరిస్తోంది. ఫలితంగా పారిశుధ్య సిబ్బంది సొంత డబ్బుతో చీపుర్లు కొనుగోలుచేసి పనులు చేపట్టాల్సిన దుస్థితి ఎదురవుతోంది. 

 ప్రతిరోజూ తెల్లవారేసరికి రోడ్లు శుభ్రంగా కనిపించాలన్నా, వీధుల్లో చెత్తచెదారం కనిపించకుండా తొలగించాలన్నా పారిశుధ్య కార్మికుల శ్రమే కారణం. అలాంటి కార్మికులకు విధి నిర్వహణలో ప్రమాదాలకు గురికాకుండా, అనారోగ్యం దరిచేరకుండా జీవీఎంసీ ప్రతి ఆరునెలలకు ఒకసారి పనిముట్లు, రక్షణ సామగ్రిని అందజేస్తుంది. నిధుల కొరత పేరుతో ఏడాదిగా వీటి కొనుగోళ్లను నిలిపేయడంతో వారంతా రక్షణ సామగ్రి, పనిముట్లు లేకుండానే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 


జీవీఎంసీ ప్రజారోగ్యవిభాగంలో సుమారు ఆరు వేల మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో వెయ్యి మంది పర్మినెంట్‌ ఉద్యోగులు కాగా, మిగిలిన వారంతా అవుట్‌సోర్సింగ్‌  పద్ధతిలో పనిచేస్తున్నారు. నగరంలో రోడ్లను ఊడ్చడం, ఓపెన్‌ డ్రైనేజీల్లో పూడికతీత, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం, వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తోపుడుబండ్లు, చక్రాల డబ్బాల్లో వేసి సమీపంలోని డంపర్‌బిన్లలో వేయడం, చెత్త కుప్పలను  వాహనాల్లోకి లోడ్‌ చేయడం వీరి విధి. కాగా కాలువలు, గెడ్డల్లో దిగినపుడు వారి కాళ్లకు దెబ్బలు తగలకుండా, మురుగు కారణంగా చర్మవ్యాధులు రాకుండా ప్లాస్టిక్‌బూట్లను జీవీఎంసీ అంజేస్తుంది.  కార్మికులు విధుల్లోకి వచ్చినపుడు తిరిగి ఇళ్లకు వెళ్లిన తర్వాత చర్మసంబంధ రుగ్మతలు దరిచేరకుండా సబ్బులు, కొబ్బరినూనె అందజేస్తుంటారు. పూడికతీసేందుకు వీలుగా గెడ్డపారలు, ఐరన్‌బ్లేడ్‌లు, అల్యూమినియం బేసిన్లు, రోడ్లు ఊడ్చేందుకు వెదురుకర్రతో ఉన్న చీపుర్లు, కొబ్బరిచీపుర్లు, మురుగునీరు, చెత్త తరచూ నిల్వ ఉండే ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా చల్లేందుకు లైమ్‌పౌడర్‌, బ్లీచింగ్‌ పౌడర్‌, రాత్రిపూట విధులు నిర్వర్తించే కార్మికులను వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఉన్నందున వాహనచోదకులు వారిని సులభంగా గుర్తించేందుకు వీలుగా రేడియం యాప్రాన్లు అందిస్తుంటారు. ఏడాదికి రెండుసార్లు చెప్పులు, యూనిఫారం కూడా అందిస్తారు. దీనికోసం ప్రజారోగ్యవిభాగం, ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు టెండర్లు పిలిచి ఏడాదికి సరిపోయే సరకుని కొనుగోలుచేసి స్టోర్‌రూమ్‌ల్లో నిల్వ చేస్తుంటారు. దీనికోసం జీవీఎంసీ ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయిస్తుంది. 

ఆర్థిక ఇబ్బందుల సాకుతో...

అయితే ఆర్థిక ఇబ్బందుల పేరుతో ఏడాదికాలంగా జీవీఎంసీ అధికారులు వీటిని కొనుగోలు చేయడం నిలిపేశారు. 2021 నాటికి నిల్వ ఉన్న సరకుని మొత్తంగా పంపిణీ చేసేయడంతో ప్రస్తుతం స్టోర్‌రూమ్‌లన్నీ ఖాళీ అయిపోయాయి. ఎక్కడైనా పారిశుధ్య సమస్య తలెత్తి డెంగ్యూ కేసు వెలుగుచూస్తే ఆ ప్రాంతంలో చల్లేందుకు కనీసం బ్లీచింగ్‌గానీ, లైమ్‌పౌడర్‌ గానీ ఒక్క కేజీ కూడా అందుబాటులో లేకపోవడం పరిస్థితికి అద్దంపడుతోంది. వెదురుకర్రలు, చీపుర్లు కూడా సరఫరా చేయకపోవడంతో పారిశుధ్య కార్మికులే తమ సొంతడబ్బుతో కొనుగోలుచేసుకుంటున్నారు. బూట్లు, కొబ్బరినూనె, సబ్బుల పంపిణీ నిలిచిపోవడంతో చర్మసంబంధ రోగాలు చుట్టుముడుతున్నాయని వాపోతున్నారు. దీనిపై ఎన్నోసార్లు యూనియన్‌ నాయకుల ద్వారా కమిషనర్‌కు, జోనల్‌ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురవలేదని, ఇప్పుడే ఎందుకు ఇలా తయారైందో అర్థం కావడం లేదని నిట్టూరుస్తున్నారు.


Updated Date - 2022-08-04T06:58:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising