ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తడిసిన వరి పనలకు మొలకలు

ABN, First Publish Date - 2022-12-16T00:00:11+05:30

తుఫాన్‌ వర్షాలకు పొలాల్లోని వరి పనాలు నీటిలో నానడంతో ధాన్యం మొలకలు వచ్చాయి.

పీకే గూడెంలో మొలకలు వస్తున్న వరి పనలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాతవరం, డిసెంబరు 15: తుఫాన్‌ వర్షాలకు పొలాల్లోని వరి పనాలు నీటిలో నానడంతో ధాన్యం మొలకలు వచ్చాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం నుంచి ఎండ కాస్తుండడంతో పదును అరడానికి వరి పనలను రైతులు తిరగేస్తుండగా.. మరికొన్నిచోట్ల వరి పనలు ధాన్యం మొలకలు రావడంతో ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజులు ఎండ కాస్తే వరి పనలు ఆరితే వరి కుప్పలు పెడదామనుకున్న సమయంలో శుక్రవారం నుంచి తుఫాన్‌ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఈసారి వర్షం వస్తే పొలాల్లో ఉన్న వరి పనలు మొలకలు వచ్చి పూర్తిగా పాడైపోతుందని రైతులు చెబుతున్నారు. రోడ్డు పక్క పొలాలు ఉన్న రైతులు మాత్రం తడిసిన వరి చేనును నూర్చి తడి ధాన్యాన్ని ఎండలో అరబెడుతున్నారు. రోడ్డుకు దూరంలో ఉండి పొల్లాలో ఉన్న వరి పనలను రైతులు ఎండలో అరబెడుతున్నారు. ధాన్యం మొలకలు వచ్చిన రైతులకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

Updated Date - 2022-12-16T00:00:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising