ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాకవరపాలెం పీహెచ్‌సీలో కు.ని. ఆపరేషన్లు బంద్‌

ABN, First Publish Date - 2022-05-15T06:25:42+05:30

ఇక్కడి ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో మూడేళ్ల నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిచిపోయాయి. దీంతో ఈ ఆస్పత్రి పరిధిలోని పలువురు బాలింతలు ఆపరేషన్ల కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళుతున్నారు.

మాకవరపాలెంలో పీహె చ్‌సీ భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 కరోనాను సాకుగా చూపి నిలిపివేత  

 ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బాలింతలు అవస్థలు

మాకవరపాలెం, మే 14 : ఇక్కడి ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంలో మూడేళ్ల నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిచిపోయాయి.  దీంతో ఈ ఆస్పత్రి పరిధిలోని పలువురు బాలింతలు ఆపరేషన్ల కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళుతున్నారు. కరోనాను సాకుగా చూపి ఈ ఆపరేషన్లను ఆపేశారని వాపోతున్నారు. ఆస్ప త్రిలో ఇద్దరు మహిళా డాక్టర్లు ఉన్నప్పటికీ  ఆపరేషన్లు చేయకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు ఈ ఆపరేషన్ల కోసం కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళు తుండగా,  పేదవర్గాల మహిళలు మాత్రం పీహెచ్‌సీ వైపే మొగ్గుచూపుతున్నారు. నరీపట్నం వెళ్లాలంటే ఒక్కో మహిళకు ఆపరేషన్‌ నిమిత్తం దాదాపు రూ.1500 ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో ఇటువంటి వారికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఎటుకూ  సరిపోవడం లేదు.  ఇప్ప టికైనా ఉన్నతాధికారులు  పీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేలా చర్యలు చేప ట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ అంశంపై పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ శ్రీవిద్యను వివరణ కోరగా, కరోనా కారణంగా ఆపరేషన్లను నిలిపి వేసినట్టు చెప్పారు. త్వరలోనే ప్రారంభి స్తామని వెల్లడించారు. 

Updated Date - 2022-05-15T06:25:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising