ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్మీలో పాతపింఛన్‌ విధానం కోసం ర్యాలీ

ABN, First Publish Date - 2022-09-26T06:39:25+05:30

దేశభద్రత, రక్షణకు కీలకమైన త్రివిధ దళాల్లో అగ్నిపథ్‌ పేరిట ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయీమెంట్‌ను ప్రవేశపెట్టి, పింఛన్‌ లేకుండా చేయడాన్ని నిరసిస్తూ కార్మికులు నగరంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):


దేశభద్రత, రక్షణకు కీలకమైన త్రివిధ దళాల్లో అగ్నిపథ్‌ పేరిట ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయీమెంట్‌ను ప్రవేశపెట్టి, పింఛన్‌ లేకుండా చేయడాన్ని నిరసిస్తూ కార్మికులు నగరంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌ఎడీ జంక్షన్‌ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అనంతరం జరిగిన సభలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ గంగవరం పోర్టు అదానికి అప్పగించిన పాలకులు, ఉక్కు కర్మాగారాన్ని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రక్షణ రంగంలో ఉద్యోగులకు పాత పింఛన్‌ విధానం అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. డిఫెన్స్‌ ఉద్యోగుల సమన్వయ కమిటీ చైర్మన్‌ రెడ్డి వెంకటరావు మాట్లాడుతూ పార్లమెంటులో పీఎఫ్‌ ఆర్‌డీ బిల్లు రద్దుచేసేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్‌సీఈ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి పి.నాగేశ్వరరావు, ఎన్‌ఏడీ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌, పి.గోపాలకృష్ణ, జి.మారుతీప్రసాద్‌, నూకరాజు, రాజేష్‌వర్మ, రతన్‌రాజు, ప్రేమానందం పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-26T06:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising