ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్‌ పునరుద్ధరించరూ..

ABN, First Publish Date - 2022-12-07T00:31:21+05:30

చ్చిన హామీ మేరకు నిలిపివేసిన వృద్ధాప్య పింఛన్‌ పునరుద్ధరించాలని మండలంలోని చింతపాకకి చెందిన సలాది గంగమ్మ(85) ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీని కోరుతున్నది.

వృద్ధురాలు గంగమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చెయ్యపేట, డిసెంబరు 6: ఇచ్చిన హామీ మేరకు నిలిపివేసిన వృద్ధాప్య పింఛన్‌ పునరుద్ధరించాలని మండలంలోని చింతపాకకి చెందిన సలాది గంగమ్మ(85) ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీని కోరుతున్నది. తన భర్త 40 సంవత్సరాల క్రితమే చనిపోయారని, తనకు రూ.30 నుంచి వితంతు పింఛన్‌ వచ్చిందని పేర్కొంది. ఏడాది క్రితం వరకు సజావుగా పింఛన్‌ వచ్చిందని, వేలిముద్రలు పడడం లేదంటూ అధికారులు నిలిపేశారని గంగమ్మ వాపోయింది. దీంతో గంగమ్మ బతుకు స్థానికల దయా ధర్మాలపై ఆధారపడింది. ఏడాది నుంచి గంగమ్మ వినతులను అధికారులెవరూ పట్టించుకోలేదు. దీంతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.ధర్మశ్రీకి గంగమ్మ తన గోడును చెప్పుకుంది. తక్షణం పింఛను పునరుద్ధరించాలని అధికారులను ఎమ్మెల్యే కె.ధర్మశ్రీ ఆదేశించారు. అయితే ఎనిమిది నెలలైనా అయినా ఆమెకు అధికారులు పింఛన్‌ను పునరుద్ధరించలేదు. పింఛన్‌ పునరుద్ధరణపై ఎమ్మెల్యే కె.ధర్మశ్రీ హామీ ఇవ్వడంతో తన కష్టాలు తొలగిపోతాయని ఆశించిన గంగమ్మకు నిరాశే మిగిలింది. ఎమ్మెల్యే ధర్మశ్రీ ప్రత్యేక దృష్టి సారించి పింఛన్‌ మంజూరు చేయించాలని గంగమ్మ కోరుతున్నది.

Updated Date - 2022-12-07T00:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising