ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూనికలు కొలతల శాఖ తనిఖీలు

ABN, First Publish Date - 2022-09-11T06:05:21+05:30

తూనికలు కొలతల శాఖ అధికారులు శనివారం నగరంలోని పలు షాపింగ్‌ మాల్స్‌, స్టోర్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

షాపింగ్‌మాల్‌లో అధికారుల తనిఖీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుకాణాలపై 61 కేసులు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడి


విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):


తూనికలు కొలతల శాఖ అధికారులు శనివారం నగరంలోని పలు షాపింగ్‌ మాల్స్‌, స్టోర్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ వివరాలు, వస్తువు బరువు, గడువు తేదీ, ధర, కస్టమర్‌ కేర్‌ వంటి వివరాలు లేకుండా పలు దుకాణాలు వస్తువులు విక్రయిస్తున్నట్టు ఈ సందర్భంగా గుర్తించారు. ప్యాకింగ్‌పై ధరలు లేకపోవడం, తదితర కారణాలతో మొత్తం 61 కేసులు (వాల్‌మార్ట్‌పై 13, మెట్రోపై 15, విశాల్‌ మార్ట్‌పై 5, లైఫ్‌ స్టైల్‌పై 5, డెకత్లాన్‌పై నాలుగు, క్రోమ్‌పై రెండు, తదితర దుకాణాలు) నమోదు చేశారు. ఇంకా వస్తువు ధర కంటే రూ.50 అదనంగా కలిపి స్టిక్టర్లు అంటించినట్టు గుర్తించి కరాచీవాలాపై మూడు కేసులను అధికారులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో సంయుక్త సంచాలకులు జి.రాజేష్‌కుమార్‌, జిల్లా సంచాలకులు బి.మధుసూదన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-11T06:05:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising