ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు భేటీ

ABN, First Publish Date - 2022-06-19T01:46:47+05:30

విశాఖపట్నం: ఇటీవల చంద్రబాబు నాయుడు మినీ మహానాడు కార్యక్రమాల్లో పాల్లొన్నారు. ఉత్తరాంధ్రలో పర్యటించారు. వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూనే.. టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఇటీవల చంద్రబాబు నాయుడు మినీ మహానాడు కార్యక్రమాల్లో పాల్లొన్నారు. ఉత్తరాంధ్రలో పర్యటించారు. వైసీపీ  వైఫల్యాలను ఎండగడుతూనే.. టీడీపీ కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపారు. రానున్న ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. దీంతో కేడర్లో కొత్త జోష్ కనిపిస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర నేతలు సమావేశమయ్యారు. 

మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ..

‘‘ఇప్పుడున్నది అరాచక, ఆటవిక ప్రభుత్వం. ఉత్తరాంధ్ర‌కి ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. ఎన్టీఆర్, చంద్రబాబు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేస్తున్నారు’’ అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మాట్లాడుతూ..

‘‘వచ్చిన జనాన్ని చూసి మంత్రులు మతిభ్రమించి మాట్లాడుతున్నారు.  ఈ మూడేళ్లలో కొత్తగా  ఒక్క ఎలిమెంటరీ స్కూల్  అయిన తెచ్చారా? మంత్రులు ఎవరు వచ్చినా సరే.. ఉత్తరాంధ్ర అభివృద్ధి‌పై చర్చకు సిద్ధం..’’ అని సవాల్ విసిరారు.

 టీడీపీ నాయకురాలు అనిత మాట్లాడుతూ..

‘‘చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అవి చెప్పలేక, లేనిపోని విమర్శలు చేస్తున్నారు. వైసీపీలో ప్రస్టేషన్ పెరిగి ఇప్పుడు సీఎం జగన్ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకుంటున్నాడు.చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం. టీడీపీఅధికారంలోకి రావడం ఖాయం..’’ అని అన్నారు. అదితి గతపతి రాజు మాట్లాడుతూ ఒ౦గోలులో నిర్వహించిన మహానాడుకు జనం భారీగా తరలివచ్చారని పేర్కొన్నారు. ప్రజలు కూడా చంద్రబాబునే కోరుకుంటున్నారని చెప్పారు. 

Updated Date - 2022-06-19T01:46:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising