ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిటైర్డు ఉద్యోగులకు అందని పింఛన్లు

ABN, First Publish Date - 2022-10-07T06:11:28+05:30

రాష్ట్రంలో ఇప్పటివరకు ఉద్యోగులకు జీతాల చెల్లింపులో మాత్రమే జాప్యం జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమ్మడి జిల్లాలో 24,000 మందికిపైగా పింఛన్‌దారులు

20 శాతం మందికి మాత్రమే జమ

మిగిలిన వారికి ఎప్పుడు అందుతాయే చెప్పలేకపోతున్న ట్రెజరీ అధికారులు

‘సమగ్రశిక్షా అభియాన్‌’ ఉద్యోగులకు కూడా అందని జీతాలు


విశాఖపట్నం/సీతమ్మధార, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): 

రాష్ట్రంలో ఇప్పటివరకు ఉద్యోగులకు జీతాల చెల్లింపులో  మాత్రమే జాప్యం జరుగుతోంది. తొలిసారిగా అక్టోబరు నెలలో పింఛన్‌దారుల ఖాతాలకు కూడా డబ్బులు జమ కాలేదు. గురువారం నాటికి 20 శాతం మందికి మాత్రమే పింఛన్లు జమ చేసినట్టు తెలిసింది. మిగిలిన వారి ఖాతాలకు ఎప్పుడు డబ్బులు జమ అవుతాయో ఖజానా అధికారులు కూడా చెప్పడం లేదు.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సుమారు 24 వేల మందికిపైగా పింఛన్‌దారులు ఉన్నారు. సీతమ్మధార సబ్‌ ట్రెజరీ పరిధిలో 17,700 మంది, అనకాపల్లి సబ్‌ట్రెజరీ పరిధిలో మూడు వేల మంది, మిగిలిన సబ్‌ట్రెజరీల పరిధిలో 500 నుంచి 800 మంది వరకు ఉన్నారు. సీతమ్మధార సబ్‌ట్రెజరీ పరిధిలో రాష్ట్రంలోనే అత్యధిక పింఛన్‌దారులు ఉన్నారు. వీరి ఖాతాల్లో ప్రతి నెలా ఒకటో తేదీకల్లా పింఛన్‌ మొత్తం జమ చేస్తారు. అయితే తొలిసారిగా గురువారం నాటికి కూడా 80 శాతం మందికి పింఛన్లు అందలేదు. పింఛన్లకు సంబంధించి ఆయా సబ్‌ ట్రెజరీ అఽధికారులు ప్రాసెస్‌ చేసి గ్రీన్‌ఛానల్‌లో పెట్టేశారు. గ్రీన్‌ఛానల్‌లో వుంటే పింఛన్లు సంబంధితుల ఖాతాల్లో జమకావాలి. అయితే ఏం జరిగిందో తెలియదుకానీ పింఛన్లు మాత్రం రాలేదు. దసరా పండుగకు పింఛన్‌ వస్తోందని పింఛన్‌దారులు వేయికళ్లతో ఎదురుచూశారు. కానీ పండుగ వెళ్లిపోయినా అందలేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులో చాలాకాలంగా జాప్యం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక్కొక్క నెల రెండో వారంలో కూడా బట్వాడా చేస్తున్నారు.


సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యోగులకు అందని జీతాలు

సమగ్రశిక్షా అభియాన్‌లో పనిచేసే రెగ్యులర్‌, తాత్కాలిక ఉద్యోగులకు గురువారం నాటికి కూడా జీతాలు జమ కాలేదు. ఉమ్మడి జిల్లాలో ఈ సంస్థ పరిధిలో వివిధ కేడర్‌లలో సుమారు 1500 మంది వరకు పనిచేస్తున్నారు. జిల్లా కార్యాలయాలతోపాటు ఎంఈవో కార్యాలయాలు, కాంప్లెక్స్‌ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులకు అరకొర జీతాలే ఇస్తున్నారు. అవి కూడా ప్రతినెలా రెండో వారంలోగానీ రావడం లేదు. దసరా పండుగ వున్నందున కనీసం ఈ నెల అయినా సకాలంలో జీతాలు ఇస్తారని ఆశతో ఎదురుచూశారు. అయినా నిరాశే మిగిలింది.

Updated Date - 2022-10-07T06:11:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising