ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వన్యప్రాణులను కాపాడుకోవాలి

ABN, First Publish Date - 2022-10-03T06:37:03+05:30

వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని డీఎఫ్‌వో అనంతశంఖర్‌ అన్నారు.

వారోత్సవాలను ప్రారంభిస్తున్న డీఎఫ్‌వో, క్యూరేటర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఎఫ్‌వో అనంతశంఖర్‌

విశాఖపట్నం, అక్టోబరు 2: వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని డీఎఫ్‌వో అనంతశంఖర్‌ అన్నారు. ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో ఆదివారం నుంచి ప్రారంభమైన వన్యప్రాణి వారోత్సవాలను క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియాతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వన్యప్రాణులపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించడానికి ఈ వారోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.


క్యూరేటర్‌ మాట్లాడుతూ ఏటా అక్టోబరు 2 నుంచి వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా అంతరించిపోతున్న జాతులను రక్షించుకునేందుకు మనవంతు బాధ్యతగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. తొలిరోజు కార్యక్రమంలో పలువురు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా, వారోత్సవాలు సందర్భంగా మాధవధార మహిళా వాకర్స్‌ క్లబ్‌ నిర్వాహకులు ఐదు నెమళ్లను ఏడాదిపాటు దత్తత తీసుకుని, అందుకు సంబంధించిన నగదు క్యూరేటర్‌కు అందించారు. 

Updated Date - 2022-10-03T06:37:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising