ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి కూలీల బకాయిలు తక్షణమే చెల్లించాలి

ABN, First Publish Date - 2022-07-18T06:42:02+05:30

పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ కూలీల బకాయిలను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి. సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న సుబ్బారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు

అనకాపల్లిటౌన్‌, జూలై 17: పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ కూలీల బకాయిలను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి. సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక దొడ్డి రామునాయుడు భవనంలో ఆదివారం వ్యవసాయ కార్మికసంఘం జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కూలీలకు ఎనిమిది వారాలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం రెండు వారాల్లో బకాయిలు చెల్లించకపోతే కూలీలు కేసులు పెట్టవచ్చనని ఉందన్నారు.  కరెంట్‌, డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌, వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కూలీలపై పెనుభారం పెరిగిందన్నారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మునుపెన్నడు లేదన్నారు. అలాగే వేసవి అలవెన్సులు పునరుద్ధరించాలని, నేషనల్‌ వెయిడ్‌ స్టాప్‌వేర్‌ను రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే పనులు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డి. వెంకన్న,  కె. భవాని, చిరంజీవి, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-18T06:42:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising