ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూ ఇయర్‌ సందడి

ABN, First Publish Date - 2022-12-31T01:53:05+05:30

నూతన సంవత్సరం వేడుకలను ఈ ఏడాది ఘనంగా జరుపుకునేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూతన సంవత్సరం వేడుకల కోసం భారీగా సిద్ధమవుతున్న కేకులు

బేకరీలకు ముందస్తు ఆర్డర్లు

స్వీట్స్‌ దుకాణాలకు కూడా అదే పరిస్థితి

బొకేలు, ఫ్రూట్‌ బాస్కెట్స్‌కు డిమాండ్‌

విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):

నూతన సంవత్సరం వేడుకలను ఈ ఏడాది ఘనంగా జరుపుకునేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్‌ సందడి మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ముందస్తు ఆర్డర్లతో స్వీట్స్‌, బేకరీ దుకాణాలు కళకళలాడుతున్నాయి. వినియోగదారుల అభిరుచులు, ఆర్డర్లకు అనుగుణంగా దుకాణదారులు ప్రత్యేక డిజైన్‌లతో కేక్స్‌, స్వీట్స్‌ సిద్ధం చేస్తున్నారు.

న్యూ ఇయర్‌ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికీ కేక్‌ గుర్తుకువస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 31వ తేదీ రాత్రి కేక్‌ కట్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బేకరీలు విభిన్న రకాల ఫ్లేవర్స్‌, డిజైన్లతో క్లాసిక్‌, ప్రీమియం కేకులు తయారుచేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో దుకాణానికి వందల ఆర్డర్లు వచ్చాయి. ఒక్కో కేకు కిలో ధర కనిష్ఠంగా రూ.350 నుంచి గరిష్టంగా రూ.1800 వరకు వుందని చెబుతున్నారు. కొత్త ఏడాది సందర్భంగా సుమారు 40 టన్నులు కేకుల విక్రయాలు జరుగుతాయంటున్నారు. ఇప్పటికే సుమారు టన్ను వరకు ముందస్తు ఆర్డర్లు వచ్చాయని, మరో రెండు టన్నులు శనివారం రాత్రి విక్రయమవుతాయని ఫ్రెష్‌ చాయిస్‌ మేనేజర్‌ నాయుడు తెలిపారు.

స్వీట్స్‌ దుకాణాలు..

నగర పరిధిలోని స్వీట్స్‌ దుకాణాలు న్యూ ఇయర్‌కు స్పెషల్‌ ఐటమ్స్‌ సిద్ధం చేస్తున్నాయి. ప్రతి దుకాణంలో కనిష్ఠంగా వంద నుంచి గరిష్ఠంగా వెయ్యి కిలోల వరకూ విక్రయాలు జరుగుతాయని చెబుతున్నారు. కనిష్ఠంగా కిలో రూ.200 నుంచి రూ.2,000 వరకూ ఉన్నాయి. కాజూ స్వీట్స్‌, మిక్సింగ్‌ స్వీట్స్‌, కోవా, గీ స్పెషల్‌ స్వీట్స్‌, బక్లావా టర్కీ స్పెషల్‌ స్వీట్‌, డ్రైఫూట్‌ స్వీట్‌, కలాకండా, కాజూ కట్లీ, కోవా ఆపిల్స్‌, డ్రైఫ్రూట్స్‌ పూతరేకులు వంటివి ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. నగర పరిధిలో స్వీట్స్‌ దుకాణాలు పెద్దవి 200కుపైగా ఉన్నాయి. ఇప్పటికే ముందస్తు ఆర్డర్లు భారీగా తీసుకున్నట్టు కొంతమంది స్వీట్‌ దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు.

ఫ్రూట్‌ బాస్కెట్లు, పూల బొకేలు..

న్యూ ఇయర్‌ రోజున అత్యధికంగా విక్రయమయ్యే జాబితాలో పండ్లు, పూల బొకేలు ముందువరుసలో ఉంటాయి. దేశ, విదేశాల నుంచి ప్రత్యేకంగా పూలను తెప్పించి బొకేలను సిద్ధం చేస్తున్నారు. ముందస్తు ఆర్డర్లు భారీగానే వస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. నగర పరిధిలో సుమారు 200 మంది వ్యాపారులు బొకేల విక్రయాలు సాగిస్తున్నారు. కోల్‌కతా, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రోజ్‌, ఆర్కెడ్‌, లీఫ్స్‌, బ్లూ డ్రైజ్‌, ఆంతోరియమ్స్‌ తీసుకువచ్చి బొకేలు తయారుచేస్తున్నారు. హ్యాండ్‌ బాస్కెట్‌, షిప్‌ బాస్కెట్‌, బొకేలు, వెడ్డింగ్‌ టైప్‌ బాస్కెట్‌, నెమలి, స్టాండింగ్‌ బొకే, సింగిల్‌ ఫ్లవర్‌ వంటి భిన్న డిజైన్లలో బొకేలు విక్రయిస్తున్నారు. ఇవి రూ.200 నుంచి రూ.2 వేలు ధరల్లో లభిస్తున్నాయి. జగదాంబ, రామాటాకీస్‌, సంపత్‌ వినాయగర్‌ టెంపుల్‌ రోడ్డు, ద్వారకానగర్‌ వంటి ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తున్నారు. అలాగే, రెండు, మూడు రకాల పండ్లతో బాస్కెట్లు తయారుచేసి న్యూ ఇయర్‌కు విక్రయించేందుకు పండ్ల వ్యాపారులు సిద్ధహవుతున్నాయి. డ్రైఫ్రూట్‌తో స్పెషల్‌ గిఫ్ట్‌ బాక్సులు న్యూ ఇయర్‌ విక్రయాల్లో అధికంగా ఉన్నాయి. పిస్తా, బాదం, కాజూ, కిస్మిస్‌, యాప్రికాట్‌తో కూడిన డ్రై ఫ్రూట్‌ గిఫ్ట్‌బాక్స్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ డ్రై ఫ్రూట్స్‌ బాక్సులు రూ.350 నుంచి రూ.2,500 వరకూ ఉన్నాయి. స్పెషల్‌ గిఫ్ట్‌ డ్రై ఫ్రూట్‌ బాక్సుల్లో మిక్స్‌డ్‌ డ్రై ఫ్రూట్స్‌, బిస్కెట్‌, చిక్కీలు, చాక్లెట్‌ వంటివి ఉన్నాయి.

Updated Date - 2022-12-31T01:53:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising