ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇనిస్టిట్యూట్‌లో కొత్త కోర్సులు

ABN, First Publish Date - 2022-12-15T00:33:03+05:30

ఆరిలోవలో ఉన్న ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇనిస్టిట్యూట్‌లో వచ్చే ఏడాది నుంచి కొత్త కోర్సులు ప్రారంభించనున్నట్టు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేవీ రమణ తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరు లతో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరిలోవ, డిసెంబరు 14: ఆరిలోవలో ఉన్న ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇనిస్టిట్యూట్‌లో వచ్చే ఏడాది నుంచి కొత్త కోర్సులు ప్రారంభించనున్నట్టు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేవీ రమణ తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరు లతో మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆరు నెలల కాలపరిమితితో ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ కోర్సు ప్రవేశ పెడుతున్నట్టు తెలిపారు. పదో తరగతి పాసైన వారు కోర్సు లో చేరడానికి అర్హులని, మొత్తం ఫీజు రూ.12 వేలు కాగా నాలుగు నెలలు ఇనిస్టిట్యూట్‌లో, రెండు నెలలు ప్రాక్టికల్స్‌ ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 19 నుంచి వచ్చేనెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జనవరి 19 న తరగతులు ప్రారంభిస్తామని, 20 సీట్లు మాత్రమే ఉన్నా యని చెప్పారు. వివరాలకు 944089850, 0891- 2553883 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. అలాగే ఇనిస్టిట్యూట్‌లో క్రిస్మస్‌, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా అతి తక్కువ ధరలకు కేక్‌లను విక్రయిస్తున్నట్టు చెప్పారు. అర్ధకిలో, పావు కిలో కేకులు కూడా లభ్యమవుతాయన్నారు.

Updated Date - 2022-12-15T00:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising