ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడు నత్తనడక!

ABN, First Publish Date - 2022-12-15T01:07:02+05:30

ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేపట్టిన నాడు-నేడు పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇటు వైద్యులు, సిబ్బంది, అటు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలల్లో చేయాల్సిన పనులు 18 నెలలు అయినా పూర్తికావడంలేదు. ఇందుకు పాయకరావుపేట మండలం శ్రీరాంపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒక ఉదాహరణ. బిల్లులు చెల్లించకపోవడంతో చేతిలో డబ్బులు లేక పనులు జాప్యం అవుతున్నాయని కాంట్రాక్టర్‌ చెబుతుండగా, పనులు ఆలస్యంగా చేయడం వల్లనే బిల్లులు మంజూరు కావడంలేదని అధికారులు అంటున్నారు. ఎవరి మాట వాస్తవమో తేల్చాలంటే ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

రేకుల షెడ్డులో ఓపీ సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీరాంపురం పీహెచ్‌సీలో కొనసా..గుతున్న పనులు

గత ఏడాది మే నెలలో ప్రారంభం

ఆరు నెలల్లో పూర్తవుతాయన్న అధికారులు

ఏడాదిన్నర దాటినా అసంపూర్తే!

తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైద్య సిబ్బంది, రోగులు

నెలల తరబడి ప్రసవాలు, కు.ని. ఆపరేషన్లు నిలిపివేత

రేకుల షెడ్డులో ఓపీ సేవలు

పాయకరావుపేట రూరల్‌, డిసెంబరు 14: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేపట్టిన నాడు-నేడు పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇటు వైద్యులు, సిబ్బంది, అటు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలల్లో చేయాల్సిన పనులు 18 నెలలు అయినా పూర్తికావడంలేదు. ఇందుకు పాయకరావుపేట మండలం శ్రీరాంపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒక ఉదాహరణ. బిల్లులు చెల్లించకపోవడంతో చేతిలో డబ్బులు లేక పనులు జాప్యం అవుతున్నాయని కాంట్రాక్టర్‌ చెబుతుండగా, పనులు ఆలస్యంగా చేయడం వల్లనే బిల్లులు మంజూరు కావడంలేదని అధికారులు అంటున్నారు. ఎవరి మాట వాస్తవమో తేల్చాలంటే ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మండలంలోని శ్రీరాంపురం పీహెచ్‌సీ ద్వారా 14 పంచాయతీలకు చెందిన 50 వేలమందికిపైగా వైద్య సేవలు పొందుతున్నారు. పాఠశాలల మాదిరిగానే ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం నాడు-నేడు కింద పనులు చేయాలని ఆదేశించింది. జిల్లా అధికారులు అంచనాలు రూపొందించి శ్రీరాంపురం పీహెచ్‌సీలో ఫ్లోరింగ్‌ మార్చడం, మరుగుదొడ్లు, విద్యుత్తు, తాగునీటి సదుపాయం కల్పించడం, భవనానికి రంగులు వేయడం, తదితర పనుల కోసం రూ.22 లక్షలు మంజూరు చేశారు. ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్‌ అధికారులు గత ఏడాది మే నెలలో టెండర్లు పిలిచి, ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఆపరేషన్‌ థియేటర్‌తోపాటు గదుల్లో వివిధ రకాల పనులు చేపట్టడంతో వైద్య సేవలకు విఘాతం కలిగింది. ఆరు నెలల్లో పూర్తవుతాయన్న ఉద్దేశంతో వైద్యులు, సిబ్బంది ఆస్పత్రి భవనానికి ఆనుకున్న వున్న రేకుల షెడ్డులో విధులు నిర్వహించడం ప్రారంభించారు. కానీ ఏడాదిన్నర దాటినా పనులు మాత్రం పూర్తికాలేదు. పైన పటారం.. లోన లొటారం అన్నచందంగా భవనం బయట గోడలకు రంగులు మాత్రం వేసి, లోపల టైల్స్‌, విద్యుత్తు, టాయిలెట్స్‌, తదితర పనులను అసంపూర్తిగా వదిలేశారు. తలుపులు, కిటికీలు బాగు చేయలేదు. భవన నిర్మాణ వ్యర్థాలను ఆస్పత్రి ఆవరణలోనే కుప్పగా పోశారు. నాడు-నేడు పనులు చేపట్టకముందు పీహెచ్‌సీలో ప్రతి నెలా సుమారు 20 వరకు ప్రసవాలు జరిగేవి. పనులు మొదలుపెట్టిన తరువాత ప్రసూతి సేవలు నిలిచిపోయాయి. ఆపరేషన్‌ థియేటర్‌లో పనులు పూర్తికాకపోవడంతో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడంలేదు. అత్యవసర వైద్య సేవలు కూడా అందడంలేదు. దీంతో పలువురు రోగులు పాయకరావుపేట, తుని ఆస్పత్రులకు వెళుతున్నారు.

కాగా ఆస్పత్రిలో చేపట్టిన నాడు-నేడు పనులు 18 నెలలు దాటినా పూర్తికాకపోవడంపై ఆర్‌అండ్‌బీ ఏఈ సత్యవాణిని వివరణ కోరగా, పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించామని చెప్పారు. ఈ నెలాఖరుకు పూర్తవుతాయని భావిస్తున్నామన్నారు.

వైద్య సేవలకు తీవ్ర ఆటంకం

డాక్టర్‌ పి.కావ్య, వైద్యాధికారి, శ్రీరాంపురం పీహెచ్‌సీ

గత ఏడాది మే నెలలో నాడు-నేడు పనులు మొదలు పెట్టారు. ఆరు నెలల్లో పూర్తికావాల్సింది ఏడాదిన్నర దాటినా పూర్తికాలేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించే పరిస్థితి లేదు. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేయించాలని కోరుతున్నాను.

Updated Date - 2022-12-15T01:07:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising