ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల విలీనంపై మరింత దూకుడు

ABN, First Publish Date - 2022-01-29T06:23:06+05:30

నూతన విద్యావిధానం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ‘మూడు’ అడుగులు ముందుకు వేసింది. ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల పరిధిలో వున్న ప్రాథమిక పాఠశాలను ఈ ఏడాదే విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సత్వరమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

3. కి.మీ. లోపు నిబంధన ఈ ఏడాదే అమలు

ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు

నేడు ఎంఈవో, హెచ్‌ఎంలతో సమావేశం


విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): నూతన విద్యావిధానం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ‘మూడు’ అడుగులు ముందుకు వేసింది. ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల పరిధిలో వున్న ప్రాథమిక పాఠశాలను ఈ ఏడాదే విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సత్వరమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది. 

నూతన విద్యా విధానం అమలులో భాగంగా ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ప్రస్తుత విద్యా సంవత్సరంలో విలీనం చేయాలని, తరువాత మూడేళ్లలో మూడు కిలోమీటర్ల దూరానికి విస్తరించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉన్నత పాఠశాలలకు 250 మీటర్లలోపు వున్న 179 ప్రాథమిక పాఠశాలలను విలీనం చేశారు. తరువాత ఉన్నత పాఠశాలలకు ఒకటి/రెండు కిలోమీటర్లలోపు వున్న ప్రాఽథమిక పాఠశాలలను విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా శాఖ అధికారులు కసరత్తు పూర్తిచేశారు. అయితే ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల లోపు వున్న ప్రాఽథమిక పాఠశాలలన్నింటినీ ఈ సంవత్సరంలోనే విలీనం చేయాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించడంతో ఎంఈవోలు, ప్రతి మండలం నుంచి ఇద్దరు హెచ్‌ఎంలతో శనివారం జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2022-01-29T06:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising