ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పేట’ వాసులను వీడని వానరాల బెడద!

ABN, First Publish Date - 2022-01-21T06:20:18+05:30

వానరాల బెడద మండల వాసులను వీడడం లేదు. పలు గ్రామాల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. అలజడి సృష్టిస్తుండడంతో పాటు కొన్ని చోట్ల పంటలను సైతం పాడుచేస్తున్నాయి.

గోపాలపట్నంలోని పెసర పంట పొలంలో సంచరిస్తున్న కోతుల మూక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పైరు పంటలను పాడుచేస్తున్న మూక

పాయకరావుపేట రూరల్‌, జనవరి 20 : వానరాల బెడద మండల వాసులను వీడడం లేదు. పలు గ్రామాల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. అలజడి సృష్టిస్తుండడంతో పాటు కొన్ని చోట్ల పంటలను సైతం పాడుచేస్తున్నాయి. తాజాగా ఇందులో కొన్నింటి కన్ను పైరు (పెసర, మినప) పంటలపై పడింది. ముఖ్యంగా పెసర మొక్కలను లాగివేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. మంగవరం, అరట్లకోట, గోపాలపట్నం, మాసాహెబ్‌పేట, సత్యవరం, శ్రీరాంపురం, గుంటపల్లి తదితర గ్రామాల్లో వీటి బెడద అధికంగా ఉంది. పొలాల నుంచి వీటిని తరిమేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.  ఒక్కోసారి తరిమే క్రమంలో మనుషులపై దాడిచేస్తున్నాయని చెపుతున్నారు. అధికారులు స్పందించి వీటి బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-01-21T06:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising